ఆసీస్‌ను చితగ్గొట్టారు | U19 WC Wrap: Clinical India begin with easy win | Sakshi
Sakshi News home page

ఆసీస్‌ను చితగ్గొట్టారు

Published Mon, Jan 15 2018 2:27 AM | Last Updated on Mon, Jan 15 2018 2:27 AM

U19 WC Wrap: Clinical India begin with easy win - Sakshi

మౌంట్‌ మాంగనీ (న్యూజిలాండ్‌): ఐసీసీ అండర్‌– 19 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో భారత్‌ 100 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై జయభేరి మోగించింది.  మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 328 పరుగులు చేసింది. కెప్టెన్‌ పృథ్వీ షా (100 బంతుల్లో 94; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), మన్‌జోత్‌ కల్రా (99 బంతుల్లో 86; 12 ఫోర్లు, 1 సిక్స్‌), శుభ్‌మాన్‌ గిల్‌ (54 బంతుల్లో 63; 6 ఫోర్లు, 1 సిక్స్‌) సత్తాచాటారు. 

  తర్వాత కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 42.5 ఓవర్లలో 228 పరుగుల వద్ద ఆలౌటైంది. బౌలింగ్‌లో పేసర్లు కమలేశ్‌ నాగర్‌కోటి (3/29), శివమ్‌ మావి (3/45) నిప్పులు చెరిగారు. దీంతో క్రమంగా వికెట్లు పడటంతో ఏ దశలోనూ ఆస్ట్రేలియా లక్ష్యం దిశగా పయనించలేకపోయింది. ఓపెనర్‌ జాక్‌ ఎడ్వర్డ్స్‌ (73; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ చేయగా, జొనాథన్‌ మెర్లో (38), బాక్స్‌టర్‌ హోల్ట్‌ (39) ఫర్వాలేదనిపించారు. రేపు జరిగే తదుపరి మ్యాచ్‌లో భారత్‌...పపువా న్యూగినియాతో తలపడుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement