♦ అండర్-19 ప్రపంచకప్ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా
మెల్‌బోర్న్: ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ నుంచి ఆస్ట్రేలియా జట్టు వైదొలిగింది. ఈనెల 27 నుంచి వచ్చే నెల 14 వరకు బంగ్లాదేశ్‌లో ఈ టోర్నీ జరుగనుండగా భద్రతాకారణాలరీత్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. ఇదే కారణంతో ఆసీస్ సీనియర్ జట్టు కూడా గత అక్టోబర్‌లో బంగ్లా పర్యటనను వాయిదా వేసుకుంది.
అప్పటి నుంచి అక్కడి పరిస్థితిని తాము సమీక్షిస్తున్నట్టు సీఏ చీఫ్ జేమ్స్ సదర్లాండ్ తెలిపారు. ‘ఐసీసీ భద్రతా సలహాదారులతో కలిసి గత వారం సీఏ భద్రతా కమిటీ చీఫ్ షాన్ కారాల్ ఢాకాకు వెళ్లారు. సంబంధిత అధికారులను కలిసి టోర్నీ సెక్యూరిటీ వివరా ల గురించి తెలుసుకున్నారు. అయితే ఆసీస్ జాతీ యులపై దాడులు జరిగే అవకాశాలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయన్న మా ప్రభుత్వ సలహా మేరకు కప్ నుంచి తప్పుకున్నాం. ఇది కఠిన నిర్ణయమే అయినా నిర్వాహకులను, అభిమానులను క్షమిం చాలని కోరుతున్నాం’ అని సదర్లాండ్ అన్నారు.
ఆసీస్ స్థానంలో ఐర్లాండ్
ఆస్ట్రేలియా స్థానంలో ఐర్లాండ్ జట్టును అండర్-19 ప్రపంచకప్‌లో ఆడేందుకు ఐసీసీ ఆహ్వానించింది. మరోవైపు టోర్నీ జరిగే సమయంలో అన్ని జట్లకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్టు పేర్కొంది. టోర్నీ నుంచి ఆసీస్ వైదొలగడం బా ధాకరమని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్‌సన్ అన్నారు.
మేం బంగ్లాదేశ్‌లో ఆడలేం
Published Wed, Jan 6 2016 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 3:08 PM
Advertisement