
న్యూఢిల్లీ: ముంబై యువ సంచలనం పృథ్వీ షా యువ భారత జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఐసీసీ అండర్–19 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును ఆదివారం బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. వచ్చే ఏడాది జరిగే ఈ అండర్–19 టోర్నీకి న్యూజిలాండ్ ఆతిథ్యమివ్వనుంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 3 వరకు మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే ఈ టీమ్‌లో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ఆటగాళ్లెవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం. క్రితంసారి ఈ మెగా టోర్నీలో రన్నరప్ అయిన భారత్ మూడు సార్లు (1988, 2002, 2010) విజేతగా నిలిచింది.
భారత అండర్–19 జట్టు: పృథ్వీ షా (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్ (వైస్ కెప్టెన్), మన్‌జోత్ కల్రా, హిమాన్షు రాణా, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ఆర్యన్ జుయల్, హార్విక్ దేశాయ్ (వీళ్లిద్దరు వికెట్ కీపర్లు), శివమ్ మావి, కమలేశ్ నాగర్‌కోటి, ఇషాన్ పొరెల్, అర్‡్షదీప్ సింగ్, అనుకూల్ రాయ్, శివా సింగ్, పంకజ్ యాదవ్. స్టాండ్‌బైలు: ఓం భోస్లే, రాహుల్ చహర్, నినద్ రథ్వా, ఉర్విల్ పటేల్, ఆదిత్య థాకరే.