IPL 2022: DC Captain Rishabh Pant Hits Sixes In Nets, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2022: షాట్లతో అలరించిన రిషభ్‌ పంత్‌.. రెప్పవాల్చని యువ ఆటగాళ్లు

Published Mon, Mar 21 2022 9:36 AM | Last Updated on Wed, Mar 23 2022 6:37 PM

IPL 2022: Rishabh Pant Hits Sixes in Nets Youngsters In Awe Behind Video - Sakshi

IPL 2022- Rishabh Pant: ఐపీఎల్‌-2022 సమరానికి జట్లు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే ఆయా జట్ల ఆటగాళ్లు ప్రాక్టీసు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఢిల్లీ​ క్యాపిటల్స్‌ కెప్టెన్‌, టీమిండియా స్టార్‌ ప్లేయర​ రిషభ్‌ పంత్‌ సైతం నెట్స్‌లో చెమటోడ్చాడు. వరుస షాట్లతో సిక్సర్ల వర్షం కురిపిస్తూ అలరించాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ ఫ్రాంఛైజీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇందులో పంత్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా.. యువ ఆటగాళ్లు యశ్‌ ధుల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, కమలేష్‌ నాగర్‌కోటి అలా చూస్తూ ఉండిపోయారు. పంత్‌ ఆటను నిశితంగా గమనించారు. కాగా శ్రీలంకతో ఇటీవల స్వదేశంలో ముగిసిన టెస్టు సిరీస్‌లో పంత్‌ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో బెంగళూరు వేదికగా జరిగిన పింక్‌ బాల్‌ టెస్టు అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్‌తో చేరాడు. ముంబైలోని తాజ్‌ మహల్‌ ప్యాలెస్‌లో బస చేస్తున్న జట్టుతో కలిశాడు. ఇక శ్రీలంకతో సిరీస్‌లో పంత్‌ అద్భుత ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. కాగా మార్చి 26 నుంచి క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ ఆరంభం కానుంది. ఇక ఢిల్లీ.. మార్చి 27 న ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఈ సీజన్‌ను ఆరంభించనుంది.

చదవండి: Shane Warne: నా గుండె నొప్పితో విలవిల్లాడుతోంది: వార్న్‌ మాజీ ప్రేయసి భావోద్వేగం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement