‘గుండె’ ధైర్యంతో ముందుకు.. క్రికెటర్‌గా రాణిస్తూ (ఫొటోలు) | indian cricketer yash dhull photos | Sakshi
Sakshi News home page

‘గుండె’ ధైర్యంతో ముందుకు.. క్రికెటర్‌గా రాణిస్తూ (ఫొటోలు)

Published Thu, Aug 29 2024 10:58 AM | Last Updated on

indian cricketer yash dhull photos1
1/16

యువ టాపార్డర్‌ బ్యాటర్‌ యశ్‌ ధుల్‌ గుండె శస్త్ర చికిత్స తర్వాత మళ్లీ బరిలోకి దిగి రాణిస్తున్నాడు

indian cricketer yash dhull photos2
2/16

అండర్‌–19 ప్రపంచకప్‌-2022లో భారత జట్టుకు టైటిల్‌ను అందించిన యశ్‌ జాతీయ శిక్షణ శిబిరం (ఎన్‌సీఏ)లో ఉండగా గుండెకు చిన్న రంధ్రం ఉన్నట్లు గుర్తించారు

indian cricketer yash dhull photos3
3/16

నిజానికి ఇలాంటి కేసులు పుట్టినపుడే బయట పడతాయి

indian cricketer yash dhull photos4
4/16

యశ్‌కూ పుట్టినపుడే ఈ రంధ్రం ఉన్నప్పటికీ 20 ఏళ్లకు పైగా ఏనాడూ బయటపడలేదు

indian cricketer yash dhull photos5
5/16

అతనికి పెద్దగా ఏ సమస్యా రాలేదు. దీంతో తనకిష్టమైన క్రికెట్‌ను యథేచ్ఛగా ఆడసాగాడు

indian cricketer yash dhull photos6
6/16

ఎన్‌సీఏలో ఈ ఏడాది అండర్‌–23 జట్టుకు ఏర్పాటు చేసి హైపెర్ఫార్మెన్స్‌ క్యాంప్‌ సందర్భంగా అతని గుండె సమస్యను ఎన్‌సీఏ వైద్య సిబ్బంది గుర్తించింది

indian cricketer yash dhull photos7
7/16

ఇది ఏమాత్రం క్లిష్టమైన సమస్య కానే కాదని మైనర్‌ సర్జరీతోనే పూర్తిగా కోలుకుంటారని చెప్పడంతో జూలైలో సర్జరీ చేశారు. కేవలం 15 రోజుల విశ్రాంతి తర్వాత మళ్లీ రోటిన్‌ లైఫ్‌ గడపొచ్చు

indian cricketer yash dhull photos8
8/16

దశాబ్ద కాలంగా ధుల్‌ కోచ్‌గా ఉన్న రాజేశ్‌ నాగర్‌ మాట్లాడుతూ... ‘ధుల్‌కు జరిగింది మైనర్‌ సర్జరీనే. కంగారేమీ లేదు. ఓ పది, పదిహేను రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే పూర్తిగా కోలుకోవచ్చు. యశ్‌ కూడా అదే చేశాడు. అయితే అతను 100 శాతం ఫిట్‌నెస్‌తో లేకపోయినా 80 శాతం ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌ ఆడేందుకు ఇది సరిపోతుంది’ అని అన్నాడు. ఈ లీగ్‌లో సెంట్రల్‌ ఢిల్లీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ధుల్‌ ఐదు ఇన్నింగ్స్‌ల్లో 113.41 స్ట్రయిక్‌రేట్‌తో 93 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధసెంచరీ (51) ఉంది

indian cricketer yash dhull photos9
9/16

21 ఏళ్ల యశ్‌ ధుల్‌ కెరీర్‌ ఆరంభంలోనే ఎత్తుపల్లాలు చూశాడు

indian cricketer yash dhull photos10
10/16

అండర్‌–19 ప్రపంచకప్‌ విజయసారథి 2022లోనే తమిళనాడు తరఫున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు శ్రీకారం చుట్టాడు

indian cricketer yash dhull photos11
11/16

రెండు శతకాలతో ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది రంజీ ట్రోఫీ కోసం ప్రకటించిన ఢిల్లీ జట్టుకు కెపె్టన్‌గా తననే నియమించారు. కానీ పుదుచ్చేరితో తొలి మ్యాచ్‌లో ఓడిపోగానే అతన్ని తప్పించేశారు

indian cricketer yash dhull photos12
12/16

భారత్‌ ‘ఎ’ తరఫున కీలక ఇన్నింగ్స్‌ ఆడిన యశ్‌కు ఐపీఎల్‌లో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. కేవలం 4 మ్యాచ్‌లే ఆడాడు

indian cricketer yash dhull photos13
13/16

indian cricketer yash dhull photos14
14/16

indian cricketer yash dhull photos15
15/16

indian cricketer yash dhull photos16
16/16

Advertisement
 
Advertisement
Advertisement