PC: BCCI
U 19 World Cup Ind Vs Sa: అండర్–19 ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుత విజయంతో టోర్నిని ఆరంభించింది. దక్షిణాఫ్రికాను మట్టికరిపించి 45 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. సారథి యశ్ ధుల్ 82 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా... బౌలర్ విక్కీ ఒత్వాల్ అద్భుతంగా రాణించాడు. 10 ఓవర్లు బౌలింగ్ చేసిన విక్కీ.. కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
కాగా వెస్టిండీస్ వేదికగా అండర్- 19 ప్రపంచకప్ ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్- బిలోని భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకోగా... యశ్ సేన 232 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనకు దిగిన ప్రొటిస్ యువ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది.
ఓపెనర్లు జాన్ డకౌట్ కాగా... వాలంటైన్ 25 పరుగులు చేసి నిష్క్రమించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన బ్రెవిస్ ఒక్కడే 65 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్ విక్కీ 5 వికెట్లు కూల్చి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. రాజ్ బవా 4 వికెట్లతో రాణించాడు. ఈ క్రమంలో 187 పరుగులకే దక్షిణాఫ్రికా చాపచుట్టేసింది. దీంతో 45 పరుగుల తేడాతో విజయం భారత జట్టు సొంతమైంది.
ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా శుక్రవారం ముగిసిన మూడో టెస్టులో ఘోర వైఫల్యంతో సిరీస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే మన యువ జట్టు ప్రొటిస్ టీమ్‌పై సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ... అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘‘శెభాష్... మీ స్థాయికి తగ్గట్లు రాణించారు.. కనీసం మీరైనా గెలిచారు. దెబ్బకొట్టారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అండర్-19 ప్రపంచకప్
స్కోర్లు: భారత్- 232-10 (46.5 ఓవర్లు)
దక్షిణాఫ్రికా- 187-10 (45.4 ఓవర్లు)
చదవండి: Rohit Sharma- Virat Kohli: కోహ్లి నిర్ణయం విని షాకయ్యాను.. రోహిత్ శర్మ పోస్టు వైరల్
Comments
Please login to add a commentAdd a comment