under 19 world cup-19
-
ind vs sa: శెభాష్.. దక్షిణాఫ్రికాపై భారత్ అద్భుత విజయం! ఏకంగా..
U 19 World Cup Ind Vs Sa: అండర్–19 ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుత విజయంతో టోర్నిని ఆరంభించింది. దక్షిణాఫ్రికాను మట్టికరిపించి 45 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. సారథి యశ్ ధుల్ 82 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా... బౌలర్ విక్కీ ఒత్వాల్ అద్భుతంగా రాణించాడు. 10 ఓవర్లు బౌలింగ్ చేసిన విక్కీ.. కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా వెస్టిండీస్ వేదికగా అండర్- 19 ప్రపంచకప్ ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్- బిలోని భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకోగా... యశ్ సేన 232 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనకు దిగిన ప్రొటిస్ యువ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు జాన్ డకౌట్ కాగా... వాలంటైన్ 25 పరుగులు చేసి నిష్క్రమించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన బ్రెవిస్ ఒక్కడే 65 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్ విక్కీ 5 వికెట్లు కూల్చి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. రాజ్ బవా 4 వికెట్లతో రాణించాడు. ఈ క్రమంలో 187 పరుగులకే దక్షిణాఫ్రికా చాపచుట్టేసింది. దీంతో 45 పరుగుల తేడాతో విజయం భారత జట్టు సొంతమైంది. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా శుక్రవారం ముగిసిన మూడో టెస్టులో ఘోర వైఫల్యంతో సిరీస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే మన యువ జట్టు ప్రొటిస్ టీమ్‌పై సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ... అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘‘శెభాష్... మీ స్థాయికి తగ్గట్లు రాణించారు.. కనీసం మీరైనా గెలిచారు. దెబ్బకొట్టారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అండర్-19 ప్రపంచకప్ స్కోర్లు: భారత్- 232-10 (46.5 ఓవర్లు) దక్షిణాఫ్రికా- 187-10 (45.4 ఓవర్లు) చదవండి: Rohit Sharma- Virat Kohli: కోహ్లి నిర్ణయం విని షాకయ్యాను.. రోహిత్ శర్మ పోస్టు వైరల్ -
బంగ్లాదేశ్ వచ్చేసింది
బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో అతి పెద్ద ఘనత... ఫిబ్రవరి 6, 2020 ఆ దేశ క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేని రోజు... తొలిసారి ఆ జట్టు ఒక అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టోర్నమెంట్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఇప్పటి వరకు ఏ ఫార్మాట్లో, ఏ స్థాయిలో కూడా తుది పోరుకు అర్హత సాధించని బంగ్లాదేశ్ జట్టు అండర్–19 ప్రపంచ కప్‌లో ఆ ఘనతను అందుకుంది. సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన భారత్‌తో ఆదివారం జరిగే చివరి సమరానికి సిద్ధమైంది. సెంచరీతో మహ్మూదుల్ హసన్, బౌలింగ్‌లో షరీఫుల్ ఇస్లామ్ ప్రదర్శన బంగ్లాదేశ్‌కు సెమీస్‌లో చిరస్మరణీయ విజయాన్ని అందించింది. భారత్, బంగ్లాదేశ్ యువ జట్లు గత సెప్టెంబరులో ఆసియా కప్ ఫైనల్లో తలపడ్డాయి. భారత్ 106 పరుగులకే కుప్పకూలినా...బంగ్లాదేశ్‌ను 101 పరుగులకే ఆలౌట్ చేసి టీమిండియా 5 పరుగులతో విజయాన్నందుకుంది. పాచెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): లీగ్ దశ నుంచి అజేయంగా నిలిచిన బంగ్లాదేశ్ తమ జోరును సెమీఫైనల్లోనూ కొనసాగించింది. అండర్–19 ప్రపంచకప్‌లో తొలిసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ యువ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేయగా... అనంతరం బంగ్లాదేశ్ 44.1 ఓవర్లలో 4 వికెట్లకు 215 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఆదివారం ఇదే మైదానంలో జరిగే ఫైనల్లో భారత్‌తో బంగ్లాదేశ్ తలపడుతుంది. రాణించిన వీలర్... బంగ్లా బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ వరుస వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు మారియూ (1), వైట్ (18)లతో పాటు లెల్‌మన్ (24), కెప్టెన్ తష్కాఫ్ (10) కూడా విఫలం కావడంతో జట్టు స్కోరు 74/4 వద్ద నిలిచింది. ఈ స్థితిలో బెకమ్ వీలర్ (83 బంతుల్లో 75 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), లిడ్‌స్టోన్ (74 బంతుల్లో 44; 2 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. అయితే 43 పరుగుల వ్యవధిలో ఆ జట్టు మళ్లీ 4 వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. షరీఫుల్ ఇస్లామ్ 45 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... షమీమ్ హుస్సేన్, హసన్ మురాద్ చెరో 2 వికెట్లు తీశారు. మహ్మూదుల్ సెంచరీ... బంగ్లాదేశ్‌కు కూడా ఛేదనలో సరైన ఆరంభం లభించలేదు. తక్కువ వ్యవధిలో ఓపెనర్లు తన్జీద్ (3), పర్వేజ్ (14) అవుటయ్యారు. అయితే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మహ్మూదుల్ హసన్ జాయ్ (127 బంతుల్లో 100; 13 ఫోర్లు) చక్కటి బ్యాటింగ్ ప్రదర్శనతో జట్టును లక్ష్యం దిశగా నడిపించాడు. అతనికి తౌహీద్ (40), షహాదత్ హుస్సేన్ (40)లనుంచి మంచి సహకారం లభించింది. తౌహీద్‌తో మూడో వికెట్‌కు 68 పరుగులు, షహాదత్‌తో నాలుగో వికెట్‌కు 101 పరుగులు జోడించిన మహ్మూదుల్ సెంచరీ పూర్తయిన అనంతరం వెనుదిరిగాడు. యూత్ క్రికెట్లో అతనికి ఇది నాలుగో శతకం కావడం విశేషం. -
అదో మంచి అవకాశం వదులుకోవద్దు..?
న్యూఢిల్లీ: అండర్-19 వరల్డ్‌కప్‌ను సాధించి అంతర్జాతీయ క్రికెట్లోకి తారజువ్వలా దూసుకొచ్చిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఈ టోర్నీ కుర్రాళ్లకు ఓ మంచి అవకాశమని చెప్పుకొచ్చాడు. జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే అండర్-19 వరల్డ్‌కప్ 2018 టోర్నీలో పాల్గొనే భారతజట్టుకు యువసంచలనం పృథ్వీషా నేతృత్వం వహిస్తుండగా.. మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా కోహ్లి కుర్రాళ్లను ఉద్దేశించి ఐసీసీ మీడియాతో మాట్లాడాడు. ‘అండర్-19 వరల్డ్‌కప్ నాజీవితంలో ఓ గొప్ప మైలురాయి. కెరీర్‌ను తీర్చిదిద్దుకునే అవకాశమిచ్చిన ఈ టోర్నీ నా మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ టోర్నీతో మంచి భవిష్యత్తుంటుందని భావించి ఈ అవకాశాన్ని కుర్రాళ్లు అందిపుచ్చుకోవాలని’ కోహ్లి సూచించాడు. తన అండర్-19 టోర్నీ సెమీఫైనల్ మ్యాచ్‌ను గుర్తుచేసుకున్న కోహ్లి న్యూజిలాండ్ అప్పటి ఇప్పటి కెప్టెన్ కన్నెవిలియమ్సన్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడని ప్రశంసించాడు. స్టీవ్‌స్మిత్ గురించి స్పందిస్తూ.. తన జట్టు వారితో తలపడలేదని, కానీ అతను తర్వాతి రోజుల్లో అద్భుతంగా రాణిస్తున్నాడని తెలిపాడు. ఈ ముగ్గురు కెప్టెన్లేమే కాదు చాలా మంది ఈ టోర్నీ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు ఎదిగారని కోహ్లి పేర్కొన్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కన్నే విలియమ్సన్ మాట్లాడుతూ.. ఇది కుర్రాళ్లకు జీవితంలో ఓ మెట్టులాంటిది. నాలుగేళ్లకోసారి జరిగే సీనియర్ క్రికెటర్ల వరల్డ్‌కప్‌లో ఎంతమందికి అవకాశం వస్తుందో చెప్పలేమని, రెండేళ్లకోసారి జరిగే ఈ ప్రపంచకప్‌ను కుర్రాళ్లు సద్వినియోగం చేసుకోవాలన్నాడు. -
క్వార్టర్స్ లో దుమ్మురేపిన యువ భారత్
ఫతుల్లా: అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా శనివారం నమీబియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో యువ భారత్ దుమ్మురేపింది. తొలుత బ్యాటింగ్ లో కుమ్మేసిన యువ భారత్.. ఆపై బౌలింగ్ లో నమీబియాను కుప్పకూల్చింది. నమీబియాపై 197 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ సెమీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 349 భారీ పరుగులు సాధించింది. భారత్ ఆటగాళ్లలో కెప్టెన్ ఇషాన్ కిషన్(6) ఆదిలోనే పెవిలియన్ కు చేరినా, రిషబ్ పంత్ (111;96 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం అన్మూల్ ప్రీత్ సింగ్(41), సర్ఫరాజ్ ఖాన్(76), ఆర్మాన్ జాఫర్(64), లామ్రోర్(41 నాటౌట్) దాటిగా ఆడటంతో భారత్ భారీ స్కోరును నమోదు చేసింది. నమీబియా బౌలర్లలో కోట్జీ మూడు వికెట్లతో రాణించాడు. ఆపై 350 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన నమీబియా 39.0 ఓవర్లలో 152 పరుగులకే చాపచుట్టేసి ఓటమి పాలైంది. పటిష్టమైన భారత బౌలింగ్ ముందు నిలబడలేక చేత్తులెత్తేసిన నమీబియా ఏ దశలోనూ ప్రతిఘటించలేదు.నమీబియా ఆటగాళ్లలో డావిన్(33), లాఫ్టీ ఈటన్(22), గ్రీన్(27), లిండే(25 ) మోస్తరుగా ఆడటంతో ఆ జట్టు ఘోర ఓటమి మూటగట్టుకుంది. భారత బౌలర్లలో మయాంక్ దాగర్, అన్మూల్ ప్రీత్ సింగ్‌లు తలో మూడు వికెట్లు సాధించగా, వాషింగ్టన్ సుందర్‌కు రెండు వికెట్లు, ఖలీల్ అహ్మద్, బాథమ్ లకు చెరో వికెట్ లభించాయి.