అదో మంచి అవకాశం వదులుకోవద్దు..? | Virat Kohli's Words Of Wisdom For Team India Ahead Of Mega Tournament | Sakshi
Sakshi News home page

అదో మంచి అవకాశం వదులుకోవద్దు..?

Published Sat, Dec 23 2017 8:27 PM | Last Updated on Tue, Sep 18 2018 8:48 PM

 Virat Kohli's Words Of Wisdom For Team India Ahead Of Mega Tournament - Sakshi

న్యూఢిల్లీ: అండర్‌-19 వరల్డ్‌కప్‌ను సాధించి అంతర్జాతీయ క్రికెట్‌లోకి తారజువ్వలా దూసుకొచ్చిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. ఈ టోర్నీ  కుర్రాళ్లకు ఓ మంచి అవకాశమని చెప్పుకొచ్చాడు. జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే అండర్‌-19 వరల్డ్‌కప్‌ 2018 టోర్నీలో పాల్గొనే భారతజట్టుకు  యువసంచలనం పృథ్వీషా నేతృత్వం వహిస్తుండగా.. మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.  ఈ సందర్భంగా కోహ్లి కుర్రాళ్లను ఉద్దేశించి ఐసీసీ మీడియాతో మాట్లాడాడు.

‘అండర్‌-19 వరల్డ్‌కప్‌ నాజీవితంలో ఓ గొప్ప మైలురాయి. కెరీర్‌ను తీర్చిదిద్దుకునే అవకాశమిచ్చిన ఈ టోర్నీ నా మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ టోర్నీతో మంచి భవిష్యత్తుంటుందని భావించి ఈ అవకాశాన్ని కుర్రాళ్లు అందిపుచ్చుకోవాలని’ కోహ్లి సూచించాడు. 

తన అండర్‌-19 టోర్నీ సెమీఫైనల్‌ మ్యాచ్‌ను గుర్తుచేసుకున్న కోహ్లి న్యూజిలాండ్‌ అప్పటి ఇప్పటి కెప్టెన్‌ కన్నెవిలియమ్సన్‌ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడని ప్రశంసించాడు. స్టీవ్‌స్మిత్‌ గురించి స్పందిస్తూ.. తన జట్టు వారితో తలపడలేదని, కానీ అతను తర్వాతి రోజుల్లో అద్భుతంగా రాణిస్తున్నాడని తెలిపాడు. ఈ ముగ్గురు కెప్టెన్లేమే కాదు చాలా మంది ఈ టోర్నీ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ వరకు ఎదిగారని కోహ్లి పేర్కొన్నాడు. 

న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కన్నే విలియమ్సన్‌ మాట్లాడుతూ.. ఇది కుర్రాళ్లకు జీవితంలో ఓ మెట్టులాంటిది. నాలుగేళ్లకోసారి జరిగే సీనియర్‌ క్రికెటర్ల వరల్డ్‌కప్‌లో ఎంతమందికి అవకాశం వస్తుందో చెప్పలేమని, రెండేళ్లకోసారి జరిగే ఈ ప్రపంచకప్‌ను కుర్రాళ్లు సద్వినియోగం చేసుకోవాలన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement