సెమీస్కు చేరిన బంగ్లాదేశ్ | Bangladesh beat Nepal to reach U-19 World Cup | Sakshi
Sakshi News home page

సెమీస్కు చేరిన బంగ్లాదేశ్

Published Fri, Feb 5 2016 8:05 PM | Last Updated on Sun, Sep 3 2017 5:01 PM

సెమీస్కు చేరిన బంగ్లాదేశ్

సెమీస్కు చేరిన బంగ్లాదేశ్

ఢాకా: అండర్-19  క్రికెట్ వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్  సెమీ ఫైనల్ కు చేరింది. శుక్రవారం నేపాల్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో గెలిచి సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది.  నేపాల్ నిర్దేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా 48.2ఓవర్లలో బంగ్లా నాలుగు వికెట్ల నష్టపోయి ఛేదించి సెమీస్ లోకి ప్రవేశించింది. 

 

బంగ్లా ఆటగాళ్లలో జాకీర్ హాసన్(75 నాటౌట్), మెహ్దీ హసన్ మిరాజ్(55 నాటౌట్) హాఫ్ సెంచరీలు నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు పినాక్ గోష్(32), సైఫ్ హసన్(5), జోయరాజ్ షేక్(38), నజ్మముల్(8) వికెట్లను బంగ్లా కోల్పోయింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నేపాల్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 211పరుగులు చేసింది. రిజాల్(72) మినహా ఎవరూ రాణించకపోవడంతో నేపాల్ స్వల్ప స్కోరుకే పరిమితం అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement