ముంబై : దక్షిణాఫ్రికాలో జరుగనున్న అండర్- 19 ప్రపంచకప్ జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సోమవారం ప్రకటించింది. జనవరి 17 నుంచి ఆరంభం కానున్న ఈ మెగా ఈవెంట్‌లో ప్రియం గార్గ్ (ఉత్తరప్రదేశ్)నేతృత్వంలోని భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ మేరకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. గ్రూప్- ఏలో భారత్‌తో పాటుగా జపాన్, న్యూజిలాండ్, శ్రీలంక క్రికెట్ జట్లు ప్రత్యర్థి జట్లతో తలపడనున్నాయి. కాగా ఫిబ్రవరి 9న పోచెఫ్‌స్ట్రూంలో ప్రపంచకప్- 2020 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఇక అండర్-19 విభాగంలో టీమిండియా ఇప్పటికే నాలుగుసార్లు ప్రపంచకప్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి నేతృత్వంలోని ఆనాటి అండర్-19 జట్టు భారత్‌కు ప్రపంచకప్ సాధించి పెట్టింది.
ప్రపంచకప్- 2020 అండర్-19 భారత జట్టు
ప్రియం గార్గ్(కెప్టెన్), ధ్రువ్ జరేల్(వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, దివ్యాంశ్ సక్సేనా, శశ్వత్ రావత్, దివ్యాంశ్ జోషి, శుభాంగ్ హెగ్డే, రవి బిష్ణోయి, ఆకాశ్ సింగ్, కార్తిక్ త్యాగి, అథర్వ అంకోలేకర్, కుమార్ కుషాగ్ర(వికెట్ కీపర్), సుశాంత్ మిశ్రా, విద్యాధర్ పాటిల్
Four-time winner India announce U19 Cricket World Cup squad. Priyam Garg to lead the side. pic.twitter.com/VEIPxe2a2n
— BCCI (@BCCI) December 2, 2019
Comments
Please login to add a commentAdd a comment