పృథ్వీషా, కమలేష్ నాగర్ కోటి, శుభమన్ గిల్
సాక్షి, బెంగళూరు : ఐపీఎల్ 11వ సీజన్‌కు జరుగుతున్న వేలంలో అండర్-19 కుర్రాళ్లు కోట్లు కొల్లగొట్టారు. తొలి రోజు బెంగళూరులో జరిగిన వేలంలో ప్రస్తుత అండర్-19 ప్రపంచకప్ ఆడుతున్న పృథ్వీషా, కమలేష్ నాగర్ కోటి, శుభ్‌మన్ గిల్‌లు అధిక ధర పలికారు. అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో పదునైన బంతులతో భారత విజయంలో కీలకపాత్ర పోషిస్తున్న కమలేష్ నాగర్ కోటి అత్యధికంగా రూ. 3.2 కోట్లు పలికాడు.
ఈ ధరకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అతన్ని సొంతం చేసుకుంది. ప్రపంచకప్ టోర్ని ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై నాగర్ కోటి గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి (3/29) భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో ప్రాంచైజీలు ఈ యువబౌలర్‌ను చేజిక్కించుకోవడానికి పోటీ పడ్డాయి. దీంతో 20 లక్షలున్న నాగర్ కోటి కనీస ధర వేలంలో రూ. మూడు కోట్లు పైగా పలికాడు.
ఇక అండర్-19 భారత జట్టుకు నేతృత్వం వహిస్తున్న పృథ్వీషా తన ఆటతో జూనియర్ సచిన్‌గా గుర్తింపు పొందాడు. ఈ తరుణంలో కుర్రాళ్ల జాబితాలో అందరి కన్నా అధిక ధర పలుకుతాడని అందరూ ఊహించగా అనూహ్యంగా రూ.1.2 కోట్లకు ఢిల్లీ డేర్ డెవిల్స్ సొంతం చేసుకుంది. ఇక మరో యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ 1.8 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక మాజీ అండర్-19 కెప్టెన్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషాన్ అనూహ్యంగా 6.2 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment