Kamlesh Nagarkoti
-
కోపం వస్తే మాములుగా ఉండదు.. మరోసారి నిరూపితం
టీమిండియా మాజీ కెప్టెన్.. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి దూకుడుకు మారుపేరు. మైదానంలో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే చాలా సందర్బాల్లో కోహ్లికి కోపం వస్తే మాములుగా ఉండదు అని నిరూపించాడు. తనను ఎవరైనా కామెంట్ చేస్తే ఊరుకోని కోహ్లి.. తన సహచర ఆటగాళ్ల విషయంలోనూ అంతే అగ్రెసివ్‌గా రియాక్ట్ అవుతుంటాడు. పూజారా, అజింకా రహానే, రిషబ్ పంత్... ఇలా ఏ ఆటగాడిని ట్రోల్ చేసినా ముందుకు దూసుకొచ్చి ప్రత్యర్థి జట్టుకి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం చేసేవాడు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు జట్టును ఎంత దూకుడుగా నడిపించాడో.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కూడా అదే పంథాను అనుసరించాడు. తాజాగా టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. జూలై 1న ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న ఏకైక టెస్టు నేపథ్యంలో లీస్టర్‌షైర్‌తో టీమిండియా నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. కాగా ఇంగ్లండ్ సిరీస్ కోసం టీమిండియా నెట్‌బౌలర్‌గా కమలేశ్ నాగర్కోటి ఎంపికయ్యాడు. వార్మప్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కమలేశ్ నాగర్‌కోటికి ప్రేక్షకుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకుల్లో ఒక వ్యక్తి పదేపదే కమలేశ్‌ను పిలిచే ప్రయత్నం చేశాడు. మ్యాచ్ జరుగుతుండడంతో కమలేశ్ స్పందించలేదు. తనకు సెల్ఫీ ఇవ్వాలని.. ఫోటో తీసేంతవరకూ తనవైపు తిరగాలంటూ గోల చేస్తూ ఇబ్బందిపెట్టాడు. ఇదంతా బాల్కనీ నుంచి గమనించిన కోహ్లి బయటికి వచ్చి ‘ఎందుకు అతన్ని విసిగిస్తున్నావ్’ అంటూ నిలదీశాడు. దానికి అతను తానేం విసిగించడం లేదని... ఫోటో ఇవ్వాలని అడుగుతున్నానంటూ సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు.‘అతను మ్యాచ్ కోసం ఇక్కడికి వచ్చాడు... నీకోసం కాదు’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మూడేళ్లుగా సెంచరీ కోసం తప్పిస్తున్న కోహ్లి కనీసం ఇంగ్లండ్ గడ్డపై ఆ ఫీట్ సాధిస్తాడేమో చూడాలి. ఈ మూడేళ్లలో వన్డేలు, టెస్టులు, టి20లు, ఐపీఎల్ ఇలా ఏవి ఆడినా సెంచరీ మార్క్‌ను మాత్రం అందుకోలేకపోయాడు. తాజాగా లీస్టర్‌షైర్‌తో వార్మప్ మ్యాచ్‌లో కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగులు చేసి ఔటయ్యాడు. Virat Teaching a lesson to a guy in crowd who was making fun of Kamlesh Nagarkoti who was standing near the Boundary line while fielding in the practise match ❤️ 'aRrOgAnT' uno 🤡@imVkohli 🐐pic.twitter.com/1urDq3jRyq — Priyanshu Bhattacharya 🏏 (@im_Priyanshu_B7) June 25, 2022 చదవండి: కోహ్లి వికెట్‌పై లీస్టర్‌షైర్ బౌలర్ స్పందన కోహ్లి చేతిపై 11 పచ్చబొట్ల వెనుక రహస్యం ఏంటంటే.. -
కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఎదురుదెబ్బ
కోల్‌కతా : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్లో మ్యాచ్‌లు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. యువ పేసర్ కమలేశ్ నాగర్ కోటి పాదం గాయం కారణంగా మొత్తం ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యాడు. అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో పదునైన బంతులతో కమలేశ్ భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతోనే ఐపీఎల్ వేలంలో ప్రాంచైజీలు యువబౌలర్‌ను చేజిక్కించుకోవడానికి పోటీ పడ్డాయి. చివరికి అత్యధికంగా రూ. 3.2 కోట్లు పెట్టి కోల్‌కతా దక్కించుకుంది. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందే కమలేశ్‌ను గాయం బాధిస్తూ వచ్చింది. ఈ క్రమంలో త్వరగా కోలుకుని టోర్నీలో పాల్గొంటాడని భావించిన కోల్‌కతాకు నిరాశే ఎదురైంది. గాయం కారణంగా కమలేశ్ నాగర్కోటి ఐపీఎల్ 11 సీజన్ మొత్తానికి దూరమైనట్టు జట్టు యాజమాన్యం ప్రకటించింది. దీంతో అతని స్థానంలో కర్ణాటక ఆటగాడు ప్రసిద్ క్రిష్ణను తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ జట్టు యాజమాన్యం ఇంకా ధ్రువీకరించలేదు. టోర్నీలో భాగంగా ఇప్పటివరకు కోల్‌కతా ఓ విజయం అందుకోగా, తన తదుపరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. -
కోట్లు కొల్లగొట్టిన కుర్రాళ్లు
సాక్షి, బెంగళూరు : ఐపీఎల్ 11వ సీజన్‌కు జరుగుతున్న వేలంలో అండర్-19 కుర్రాళ్లు కోట్లు కొల్లగొట్టారు. తొలి రోజు బెంగళూరులో జరిగిన వేలంలో ప్రస్తుత అండర్-19 ప్రపంచకప్ ఆడుతున్న పృథ్వీషా, కమలేష్ నాగర్ కోటి, శుభ్‌మన్ గిల్లు అధిక ధర పలికారు. అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో పదునైన బంతులతో భారత విజయంలో కీలకపాత్ర పోషిస్తున్న కమలేష్ నాగర్ కోటి అత్యధికంగా రూ. 3.2 కోట్లు పలికాడు. ఈ ధరకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అతన్ని సొంతం చేసుకుంది. ప్రపంచకప్ టోర్ని ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై నాగర్ కోటి గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి (3/29) భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో ప్రాంచైజీలు ఈ యువబౌలర్‌ను చేజిక్కించుకోవడానికి పోటీ పడ్డాయి. దీంతో 20 లక్షలున్న నాగర్ కోటి కనీస ధర వేలంలో రూ. మూడు కోట్లు పైగా పలికాడు. ఇక అండర్-19 భారత జట్టుకు నేతృత్వం వహిస్తున్న పృథ్వీషా తన ఆటతో జూనియర్ సచిన్‌గా గుర్తింపు పొందాడు. ఈ తరుణంలో కుర్రాళ్ల జాబితాలో అందరి కన్నా అధిక ధర పలుకుతాడని అందరూ ఊహించగా అనూహ్యంగా రూ.1.2 కోట్లకు ఢిల్లీ డేర్ డెవిల్స్ సొంతం చేసుకుంది. ఇక మరో యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ 1.8 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక మాజీ అండర్-19 కెప్టెన్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషాన్ అనూహ్యంగా 6.2 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. -
145 కి.మీ వేగంతో దడ పుట్టించారు
బే ఓవెల్ : పృథ్వీ షా సారథ్యంలోని భారత కుర్రాళ్లు న్యూజిలాండ్‌లో జరగుతున్న అండర్ -19 ప్రపంచకప్‌లో అదరగొడుతున్నారు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్ 328 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా.. పదునైన బంతులతో భారత పేస్ బృందం ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ను ముప్పతిప్పలు పెట్టింది. భారత పేసర్లు శివం మవి, కమలేశ్ నగర్కోటి, ఇషాన్ పొరెల్‌లు స్థిరంగా 145 పైచిలుకూ వేగంతో బంతులు విసిరారు. వేగం, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తున్న ఈ ముగ్గురిని గుర్తించిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. విరాట్ కొహ్లీ, వీవీఎస్ లక్ష్మణ్‌ల దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్‌పై ఆశలు చిగురింపజేస్తున్న వీరిపై దృష్టి సారించాలని కోరారు. కాగా, మ్యాచ్‌లో వేగవంతమైన డెలివరి(149 కి.మీ)ను నగర్కోటి విసిరాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అండర్-19 జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. (చదవండి.. మనకు సచిన్ మళ్లీ దొరికాడు..!)