ఐపీఎల్‌ టోర్నీకి శివమ్‌ మావి దూరం    | Shivam is far from the IPL tournament | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ టోర్నీకి శివమ్‌ మావి దూరం   

Published Thu, Apr 4 2024 3:47 AM | Last Updated on Thu, Apr 4 2024 11:37 AM

Shivam is far from the IPL tournament - Sakshi

పక్కటెముకల గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో భారత క్రికెటర్, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు పేస్‌ బౌలర్‌ శివమ్‌ మావి ఐపీఎల్‌ 17వ సీజన్‌ నుంచి వైదొలిగాడు. గత ఏడాది ఐపీఎల్‌లో రన్నరప్‌గా నిలిచిన గుజరాత్‌ టైటాన్స్‌ జట్టులో శివమ్‌ మావి సభ్యుడిగా ఉన్నాడు. అయితే అతనికి ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు. గత డిసెంబర్‌లో జరిగిన మినీ వేలంలో లక్నో ఫ్రాంచైజీ ఏకంగా రూ. 6 కోట్ల 40 లక్షలకు శివమ్‌ మావిని కొనుగోలు చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement