
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రాగా భారత జట్టు ముగించింది. కాగా మూడో టీ20 అనంతరం టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌పై కోపంతో ఊగిపోయాడు. టీమ్ ప్రయాణిస్తున్న బస్సులో అర్ష్‌దీప్ వైపు వేలు చూపిస్తూ సూర్య ఏదో అన్నాడు.
అయితే సూర్య కోపానికి గల కారణమింటో మాత్రం తెలియదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు సూర్య సరదగా అలా రియాక్ట్ అయివుంటాడని కామెంట్లు చేస్తున్నారు. కాగా మూడో టీ20లో సూర్య భాయ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగిన సంగతి తెలసిందే. ఇక ప్రోటీస్‌తో టీ20 సిరీస్‌ను సమం చేసిన టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్‌కు సిద్దమవుతోంది.
డిసెంబర్ 17న జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఈ సిరీస్‌లో భారత కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించనుండగా.. దక్షిణాఫ్రికా సారథిగా మార్‌క్రమ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
చదవండి: SA vs IND: ముంబై కెప్టెన్సీ నుంచి అవుట్.. దక్షిణాఫ్రికాకు బయలుదేరిన రోహిత్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment