వన్డే ప్రపంచకప్‌కు ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో లెఫ్ట్మ్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు చోటు దక్కపోయిన సంగతి తెలిసిందే. గతేడాది వన్డేల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్ పెద్దగా అకట్టుకోలేదు. కానీ టీ20ల్లో మాత్రం అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.
అయితే ప్రస్తుత భారత జట్టులో లెఫ్ట్మ్ ఆర్మ్ పేసర్లు మాత్రం తక్కువగా ఉన్నారు. ఇదే విషయంపై భారత మాజీ బౌలింగ్ కోచ్ అరుణ్ భరత్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. అర్ష్‌దీప్‌కు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించందని భరత్ చెప్పుకొచ్చాడు.
"నేను కోచింగ్ స్టాప్‌లో భాగంగా ఉన్నప్పుడు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లను తీసుకురావడానికి ప్రయత్నించాను. మేనెజ్‌మెంట్ కూడా దీనిపై తీవ్రంగా కృషి చేసింది. ఆ సమయంలో అర్ష్‌దీప్ రూపంలో మాకు అద్భుతమైన లెఫ్ట్ ఆర్మ్‌పేసర్ దొరికాడు. తన ఆరంభంలో మెరుగైన ప్రదర్శన కూడా కనబరిచాడు. కానీ ఈ రోజు అతడికి జట్టులో చోటే లేదు.
అతడిని ఎందుకు ఎంపిక చేయడం లేదో నాకు అర్ధం కావడం లేదు. అతడు యార్కర్లను బాగా బౌలింగ్ చేయగలడు. స్లో బంతులతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగలడు. అతడు వరల్డ్‌కప్ జట్టలో లేకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. జట్టులో కనీసం ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయినా ఉండాల్సిందని క్రికెట్ బసు యూట్యూబ్ ఛానల్‌లో భరత్ పేర్కొన్నాడు.
వరల్డ్‌కప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ
చదవండి: జట్టులో అందరికంటే నాకే వర్క్‌లోడ్ ఎక్కువ.. ఎందుకంటే?: హార్దిక్
Comments
Please login to add a commentAdd a comment