టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా న్యూయర్క్ వేదికగా అమెరికాతో మ్యాచ్‌లో టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే అమెరికా బ్యాటర్లకు అర్ష్‌దీప్ చుక్కలు చూపించాడు.
తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టి అమెరికాను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఓవరాల్‌గా తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చిన అర్ష్‌దీప్.. 4 వికెట్లు పడగొట్టాడు.
ఈ క్రమంలో అర్ష్‌దీప్ సింగ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యత్తుమ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్‌గా అర్ష్‌దీప్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన పేరిట ఉండేది.
2014 టీ20 వరల్డ్‌కప్‌లో ఆసీస్‌పై అశ్విన్ 11 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌లో కేవలం 9 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టిన అర్ష్‌దీప్.. అశ్విన్ రికార్డును బ్రేక్ చేశాడు.
అదే విధంగా మరో రికార్డును అర్ష్‌దీప్ సాధించాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో మొదటి బంతికే వికెట్ పడగొట్టిన మొదటి భారత బౌలర్‌గా అర్ష్‌దీప్ నిలిచాడు. యూఎస్‌ఎ ఓపెనర్ జహంగీర్‌ను మొదటి బంతికే ఔట్ చేసిన అర్ష్‌దీప్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment