వారెవ్వా అర్ష్‌దీప్‌.. ఏమైనా బాల్‌ వేశాడా? చూస్తే మైండ్‌ బ్లాంక్‌ | Litton Das Bamboozled As Arshdeep Singhs Nip-Backer To Clean Him Up | Sakshi
Sakshi News home page

T20 WC: వారెవ్వా అర్ష్‌దీప్‌.. ఏమైనా బాల్‌ వేశాడా? చూస్తే మైండ్‌ బ్లాంక్‌

Published Sun, Jun 2 2024 4:40 PM | Last Updated on Sun, Jun 2 2024 5:28 PM

 Litton Das Bamboozled As Arshdeep Singhs Nip-Backer To Clean Him Up

టీ20 వరల్డ్‌కప్‌-2024 ప్రధాన టోర్నీకు ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో టీమిండియా సత్తాచాటింది. న్యూయర్క్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 60 పరుగుల తేడాతో భారత్‌ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

రిషబ్ పంత్ 32 బంతుల్లో 53 పరుగులు, హార్దిక్ పాండ్యా 40(నాటౌట్‌) పరుగులతో రాణించారు. అయితే లక్ష్య ఛేదనలో బంగ్లా బ్యాటర్లు విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగల్గింది.

సూపర్‌ డెలివరీ..
ఇక ఈ వార్మాప్‌ మ్యాచ్‌లో టీమిండియా పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 3 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అర్ష్‌దీప్‌ కేవలం​ 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే బంగ్లా ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ను అర్ష్‌దీప్‌ ఔట్‌ చేసిన విధానం మ్యాచ్‌ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. 

బంగ్లా ఇన్నింగ్స్‌ 3వ ఓవర్‌ వేసిన అర్ష్‌దీప్‌ తొలి బంతిని లిటన్‌ దాస్‌కు బ్యాకప్‌ లెంగ్త్‌ డెలివరీగా సంధించాడు. ఆఫ్‌సైడ్‌ పడిన బంతి ఒక్కసారిగా టర్న్‌ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. అర్ష్‌దీప్‌ వేసిన బంతికి లిటన్‌ దగ్గర సమాధానమే లేకుండా పోయింది.

ఇది చూసిన లిటన్‌ దాస్‌ ఒక్కసారిగా షాక్‌ అయిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు అర్ష్‌దీప్‌ ప్రధాన టోర్నీలో కూడా కొనసాగించాలని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement