లక్నో: భారత్ విజయలక్ష్యం 100 పరుగులు... పిచ్ ఎలా ఉన్నా ఇది మన లైనప్‌కు సులువైన లక్ష్యంలాగే అనిపించింది... కానీ న్యూజిలాండ్ అంత సులువుగా ఓటమిని అంగీకరించలేదు. చివరి వరకు పోరాడింది. ఎట్టకేలకు ఒక బంతి మిగిలి ఉండగా మ్యాచ్‌ను ముగించి భారత్ ఊపిరి పీల్చుకుంది. రెగ్యులర్, పార్ట్‌టైమ్ స్పిన్నర్లు కూడా హవా చూపించిన రెండో టి20 మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది.
మిచెల్ సాన్‌ట్నర్ (19 నాటౌట్)దే అత్యధిక స్కోరు కాగా... అర్‡్షదీప్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 101 పరుగులు చేసింది. కఠిన పరిస్థితుల్లో తన శైలికి భిన్నంగా ఆడిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (31 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్) చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్ మొత్తంలో ఒక్క సిక్స్ కూడా నమోదు కాకపోవడం విశేషం. తాజా ఫలితంతో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవగా...సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి మ్యాచ్ బుధవారం అహ్మదాబాద్‌లో జరుగుతుంది.
స్కోరు వివరాలు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: అలెన్ (బి) చహల్ 11; కాన్వే (సి) ఇషాన్ (బి) సుందర్ 11; చాప్‌మన్ (రనౌట్) 14; ఫిలిప్స్ (బి) హుడా 5; మిచెల్ (బి) కుల్దీప్ 8; బ్రేస్‌వెల్ (సి) అర్‡్షదీప్ (బి) పాండ్యా 14; సాన్‌ట్నర్ (నాటౌట్) 19; సోధి (సి) పాండ్యా (బి) అర్‡్షదీప్ 1; ఫెర్గూసన్ (సి) సుందర్ (బి) అర్‡్షదీప్ 0; డఫీ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 99.
వికెట్ల పతనం: 1–21, 2–28, 3–35, 4–48, 5–60, 6–80, 7–83, 8–83.
బౌలింగ్: పాండ్యా 4–0–25–1, సుందర్ 3–0–17–1, చహల్ 2–1–4–1, హుడా 4–0–17–1, కుల్దీప్ 4–0–17–1, అర్‡్షదీప్ 2–0–7–2, మావి 1–0–11–0.
భారత్ ఇన్నింగ్స్: గిల్ (సి) అలెన్ (బి) బ్రేస్‌వెల్ 11; ఇషాన్ (రనౌట్) 19; త్రిపాఠి (సి) ఫిలిప్స్ (బి) సోధి 13; సూర్యకుమార్ (నాటౌట్) 26; సుందర్ (రనౌట్) 10; పాండ్యా (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.5 ఓవర్లలో 4 వికెట్లకు) 101.
వికెట్ల పతనం: 1–17, 2–46, 3–50, 4–70.
బౌలింగ్: డఫీ 1–0–8–0, బ్రేస్‌వెల్ 4–0–13–1, సాన్‌ట్నర్ 4–0–20–0, ఫిలిప్స్ 4–0–17–0, సోధి 4–0–24–1, చాప్‌మన్ 1–0–4–0, ఫెర్గూసన్ 1–0–7–0, టిక్నర్ 0.5–0–7–0.
Comments
Please login to add a commentAdd a comment