Ind Vs Nz: First Time 2 Team India Bowlers Have Taken Four Wickets Each In T20 Match - Sakshi
Sakshi News home page

IND Vs NZ: టీమిండియా బౌలర్ల అరుదైన ఘనత.. టి20 చరిత్రలో తొలిసారి

Published Tue, Nov 22 2022 4:05 PM | Last Updated on Tue, Nov 22 2022 5:30 PM

First-Instance 2-Indian Bowlers Picks 4-Wickets Each T20 International - Sakshi

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టి20లో టీమిండియా బౌలర్లు చెలరేగారు. ముఖ్యంగా పేసర్లు మహ్మద్‌ సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లు మంచి ప్రదర్శన కనబరిచారు. ఒక దశలో న్యూజిలాండ్‌ 130 పరుగులకు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఈ దశలో మరోసారి స్పెల్‌కు వచ్చిన సిరాజ్‌, అర్ష్‌దీప్‌లు తమ బౌలింగ్‌తో అదరగొట్టారు. ఈ ఇద్దరు చెరో నాలుగు వికెట్లు తీయడంతో కివీస్‌ 160 పరుగులకు ఆలౌట్‌ అయింది.

వీరిద్దరి జోరుకు 130/2తో పటిష్టంగా కనిపించిన కివీస్‌.. కేవలం 30 పరుగుల వ్యవధిలో మిగతా 8 వికెట్లు చేజార్చుకోవడం గమనార్హం. ఇక మహ్మద్‌ సిరాజ్‌ న్యూజిలాండ్‌పై తన కెరీర్‌ బెస్ట్‌ బౌలింగ్‌ను నమోదు చేశాడు. నాలుగు ఓవర్లు వేసిన సిరాజ్‌ 17 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు.

► ఇక సిరాజ్‌ కంటే ముందు దీపక్‌ హుడా ఇదే సిరీస్‌లో కివీస్‌తో రెండో టి20ల్లో 10 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఇక 2021లో కోల్‌కతా వేదికగా కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్‌ పటేల్‌ 9 పరుగులిచ్చి మూడు వికెట్లు తీయడం మూడో అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది.

►ఇక న్యూజిలాండ్‌తో టి20 మ్యాచ్‌లో టీమిండియాకు చెందిన ఇ‍ద్దరు బౌలర్లు(సిరాజ్‌, అర్ష్‌దీప్‌) చెరో నాలుగు వికెట్లు తీయడం ఇదే తొలిసారి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement