
ICC ODI World Cup 2023- Team India: వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో భారత జట్టు కూర్పుపై టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్లుగా ఎదుగుతున్న ఓ ఇద్దరు ఆటగాళ్లకు తన జట్టులో చోటు ఇచ్చేది లేదని పేర్కొన్నాడు. తానే గనుక బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవిలో ఉంటే ప్రపంచకప్ జట్టు ఇలాగే ఉండాలని కోరుకుంటానంటూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
వాళ్లు నలుగురు చాలు
స్టార్ స్పోర్ట్స్ షోలో చిక్కా మాట్లాడుతూ.. ‘‘నా వరల్డ్‌కప్ జట్టులో శుబ్‌మన్ గిల్, శార్దూల్ ఠాకూర్‌కు చోటు లేదు. ఇక పేసర్ల విషయానికొస్తే.. నలుగురు చాలు. బుమ్రా, ఉమ్రాన్ మాలిక్ , అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ జట్టులో ఉంటే సరిపోతుంది. షమీ సో-సోగా ఆడతాడు.
కాబట్టి తను అవసరం లేదు. దీపక్ హుడా జట్టులో ఉంటే బాగుంటుంది. వీళ్లందరికి జట్టును గెలిపించగల సత్తా ఉంది. అయితే, ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల యూసఫ్ పఠాన్ వంటి రేసు గుర్రాలు జట్టులో ఉండాలని కోరుకుంటాం కదా! నా వరకైతే అలాంటి గెలుపు గుర్రం రిషభ్ పంత్.
క్రిష్ణమాచారి శ్రీకాంత్
పంత్ ఉంటేనే
పదింట మూడు మ్యాచ్‌లను గెలిపించినా నేను వాళ్లకే పెద్దపీట వేస్తాను. కీలక సమయంలో జట్టును గెలిపించే వాళ్లు కావాలి. పంత్ అలాంటి వాడే! ఇలాంటి ఆటగాళ్ల నుంచి నిలకడైన ప్రదర్శన కోరుకోకూడదు.
రిషభ్ పంత్‌కు ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా ఉంది కాబట్టి తను ఉంటే బాగుంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. టీమిండియా అభిమానిగా కాకుండా.. చీఫ్ సెలక్టర్ పదవిలో ఉన్నాననుకుని ఈ మాటలు మాట్లాడానంటూ ఈ మాజీ సెలక్టర్ పేర్కొన్నాడు.
ఓపెనింగ్ స్థానం కోసం తీవ్ర పోటీ
సొంతగడ్డపై ఈ ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ 20 మందితో జట్టును సిద్ధం చేస్తున్న వేళ శ్రీకాంత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. శిఖర్ ధావన్ స్థానంలో యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌కు వరుస అవకాశాలు ఇస్తున్న తరుణంలో చిక్కా.. అతడికి తన జట్టులో చోటివ్వనని పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మకు జోడీగా రాహుల్‌తో పాటు యువ ప్లేయర్లు ఇషాన్ కిషన్, గిల్ ఓపెనింగ్ స్థానం కోసం పోటీపడుతున్నారు.
చదవండి: Sarfaraz Ahmed: నీ కెరీర్ ముగిసిపోయిందన్నాడు! రమీజ్ రాజాకు దిమ్మతిరిగేలా కౌంటర్!
Ind VS SL 3rd T20: భారీ స్కోర్లు గ్యారంటీ! అతడికి ఉద్వాసన.. రుతురాజ్ ఎంట్రీ!