
అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా అరుదైన ఘనత సాధించింది. బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి.. పాకిస్తాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు సమం చేసింది. కాగా భారత జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడుతోంది.
127 పరుగులకు బంగ్లా ఆలౌట్
తొలుత రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-0తో రోహిత్ సేన పర్యాటక జట్టును క్లీన్‌స్వీప్ చేయగా.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్ టీ20లలోనూ శుభారంభం చేసింది. గ్వాలియర్‌లోని మాధవ్‌రావ్ సింధియా కొత్త క్రికెట్ స్టేడియంలో టీమిండియా ఆదివారం బంగ్లాదేశ్‌తో తలపడింది.
టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ చేయగా.. బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో పేసర్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అర్ష్‌దీప్ సింగ్ మూడు(3/14), హార్దిక్ పాండ్యా(1/26), మయాంక్ యాదవ్(1/21) ఒక్కో వికెట్ తీయగా.. స్పిన్నర్లలో రీ ఎంట్రీ వీరుడు వరుణ్ చక్రవర్తి మూడు(3/31), వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్(1/12) తీశారు.
పాకిస్తాన్ ప్రపంచ రికార్డు సమం
ఈ క్రమంలో టీమిండియా.. అంతర్జాతీయ టీ20లలో ప్రత్యర్థిని అత్యధిక సార్లు ఆలౌట్ చేసిన జట్టుగా నిలిచింది. తద్వారా పాకిస్తాన్ ప్రపంచ రికార్డును సమం చేసింది. ఈ జాబితాలో భారత్- పాకిస్తాన్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్, ఉగాండా, వెస్టిండీస్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ టీ20లలో ప్రత్యర్థిని అత్యధికసార్లు ఆలౌట్ చేసిన జట్లు
👉టీమిండియా- 42 సార్లు
👉పాకిస్తాన్- 42 సార్లు
👉న్యూజిలాండ్- 40 సార్లు
👉ఉగాండా- 35 సార్లు
👉వెస్టిండీస్- 32 సార్లు
ఇదిలా ఉంటే.. తొలి టీ20లో బంగ్లా విధించిన స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 11.5 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు సంజూ శాంసన్(29), అభిషేక్ శర్మ(16) ధనాధన్ దంచికొట్టగా.. సూర్యకుమార్ యాదవ్(29) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు.
ఇక నాలుగో స్థానంలో వచ్చిన అరంగేట్ర ఆటగాడు నితీశ్ రెడ్డి 16.. హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 39) పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా ఏడు వికెట్ల తేడాతో విజయం భారత్ సొంతమైంది. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
చదవండి: మా బ్యాటింగ్ గొప్పగా ఉంది.. ఆ తలనొప్పి మంచిదే: సూర్యకుమార్
Hardik Pandya finishes off in style in Gwalior 💥#TeamIndia win the #INDvBAN T20I series opener and take a 1⃣-0⃣ lead in the series 👌👌
Scorecard - https://t.co/Q8cyP5jXLe@IDFCFIRSTBank pic.twitter.com/uYAuibix7Q— BCCI (@BCCI) October 6, 2024