సన్‌రైజర్స్‌కు ఇది కొత్తేం కాదు.. పంజాబ్‌ కింగ్స్‌కు కూడా! | IPL 2024 PBKS vs SRH Narrowest Margin of Defeats Narrowest Margin Of Wins | Sakshi
Sakshi News home page

IPL: సన్‌రైజర్స్‌కు ఇది కొత్తేం కాదు.. పంజాబ్‌ కింగ్స్‌కు కూడా!

Published Wed, Apr 10 2024 10:37 AM | Last Updated on Wed, Apr 10 2024 10:54 AM

IPL 2024 PBKS vs SRH Narrowest Margin of Defeats Narrowest Margin Of Wins - Sakshi

ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ కమిన్స్‌- పంజాబ్‌ కింగ్స్‌ సారథి శిఖర్‌ ధావన్‌(PC: IPL)

ఐపీఎల్‌-2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- పంజాబ్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ టీ20 ప్రేమికులకు అసలైన మజా అందించనడంలో సందేహం లేదు. ఆద్యంతం ఆసక్తి రేపిన ఈ మ్యాచ్‌ ఆఖరి వరకు ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టింది.

చివరి బంతి వరకు ఉత్కంఠ కలిగించిన ఈ మ్యాచ్‌లో ఎట్టకేలకు సన్‌రైజర్స్‌ జయభేరి మోగించింది. కేవలం రెండు పరుగుల తేడాతో గెలుపొంది సీజన్‌లో మూడో విజయం అందుకుంది. మరోవైపు.. సొంతగడ్డపై ఓటమి పాలైన పంజాబ్‌ కింగ్స్‌ మూడో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది.

ఇక ఇలా ఆఖరి వరకు ఊరించి ఓడిపోవడం పంజాబ్‌ కింగ్స్‌కు కొత్తేం కాదు. అలాగే సన్‌రైజర్స్‌ కూడా ఆఖరి వరకు అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠ కలిగించి విజయబావుటా ఎగురువేయడం అలవాటేనని గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఈ రెండు జట్లలో సన్‌రైజర్స్‌ 2016లో టైటిల్‌ విజేతగా నిలవగా.. పంజాబ్‌ కింగ్స్‌ ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు.

ఐపీఎల్‌ చరిత్రలో విజయానికి అత్యంత చేరువగా వచ్చి పంజాబ్‌ కింగ్స్‌ ఓడిన సందర్భాలు(పరుగుల పరంగా)
►2016- మొహాలీ- ఆర్సీబీతో మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఓటమి
►2020- అబుదాబి- కేకేఆర్‌తో మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో ఓటమి
►2021- దుబాయ్‌- రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో ఓటమి
►2024- ముల్లన్‌పూర్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో ఓటమి

ఐపీఎల్‌ చరిత్రలో ఆఖరి వరకు ఊరించి పరుగుల పరంగా స్వల్ప తేడాతో సన్‌రైజర్స్‌ గెలిచిన సందర్భాలు
►2024- ముల్లన్‌పూర్‌- పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో విజయం
►2022- ముంబై- ముంబై ఇండియన్స్‌పై మూడు పరుగుల తేడాతో విజయం
►2014- దుబాయ్‌- ఢిల్లీ క్యాపిటల్స్‌పై నాలుగు పరుగుల తేడాతో విజయం
►2016- వైజాగ్‌- రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌పై నాలుగు పరుగుల తేడాతో విజయం
►2021- అబుదాబి- ఆర్సీబీపై నాలుగు పరుగుల తేడాతో విజయం.

మ్యాచ్‌ విషయానికొస్తే... PBKS vs SRH Scores
►వేదిక: ముల్లన్‌పూర్‌.. చండీగఢ్‌
►టాస్‌: పంజాబ్‌ కింగ్స్‌.. బౌలింగ్‌
►సన్‌రైజర్స్‌ స్కోరు: 182/9 (20)
►టాప్‌ స్కోరర్‌: నితీశ్‌ కుమార్‌ రెడ్డి: 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 64 పరుగులు

►పంజాబ్‌ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ సూపర్‌ స్పెల్‌: 4/29
►పంజాబ్‌ కింగ్స్‌ స్కోరు:  180/6 (20) 
►ఫలితం: రెండు పరుగులు తేడాతో సన్‌రైజర్స్‌ గెలుపు
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: నితీశ్‌ కుమార్‌ రెడ్డి(64 రన్స్‌తో పాటు ఒక వికెట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement