టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు జరిగిన మెగా వేలంలో అతడు రూ. 2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో మొదటి సెట్‌లో భాగంగా తొలి ఆటగాడిగా ఆక్షన్‌లోకి వచ్చిన అర్ష్‌దీప్ సింగ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తొలుత రంగంలోకి దిగగా.. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ పోటీకి వచ్చాయి.
అయితే, అనూహ్యంగా రేసులోకి వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అర్ష్‌దీప్ ధరను రూ. 15.75 కోట్లకు పెంచింది. ఈ నేపథ్యంలో రిటెన్షన్‌కు ముందు అర్ష్‌దీప్‌ను వదిలేసిన పంజాబ్ కింగ్స్ రైజర్స్‌తో పోటీకి దిగింది. రైటు మ్యాచ్ కార్డు ద్వారా అతడిని సొంతం చేసుకునేందుకు ముందుకు వచ్చింది.
అయినప్పటికీ సన్‌రైజర్స్ మాత్రం వెనక్కి తగ్గలేదు. అర్ష్‌దీప్ కోసం రూ. 18 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమైంది. అయితే, పంజాబ్ మాత్రం ఈ టీమిండియా స్టార్‌ను వదులుకునేందుకు ఇష్టపడలేదు. దీంతో ఫైనల్ బిడ్‌గా రూ. 18 కోట్లకు అర్ష్‌దీప్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలో క్యాష్ రిచ్ లీగ్‌లో రూ. 18 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయిన భారత ఆటగాడిగా అర్ష్‌దీప్ నిలిచాడు.
కాగా లెఫ్టార్మ్ పేసర్ అయిన అర్ష్‌దీప్ ఇప్పటి వరకు 65 మ్యాచ్‌లలో కలిపి 76 వికెట్లు పడగొట్టాడు. అయితే, టీమిండియా తరఫున మాత్రం అతడికి టీ20లలో మాత్రం గొప్ప రికార్డు ఉంది. ఇప్పటికి ఆడిన 60 మ్యాచ్‌లలోనే అతడు 95 వికెట్లు పడగొట్టడం విశేషం.
చదవండి: RTM కార్డు విషయంలో ట్విస్ట్ ఇచ్చిన బీసీసీఐ.. ఈ వేలం మునుపటిలా ఉండదు!
Comments
Please login to add a commentAdd a comment