Arshdeep Singh Ignored Yet Again For Ind Vs WI Test And Odi Series 2023 - Sakshi
Sakshi News home page

IND vs WI: యార్కర్ల కింగ్‌ అన్నారు.. ఇప్పుడు జట్టు నుంచి ఏకంగా పక్కన పెట్టేశారు!

Published Sat, Jun 24 2023 11:54 AM | Last Updated on Sat, Jun 24 2023 12:44 PM

Arshdeep Singh GNORED yet again for IND vs WI ODIs - Sakshi

టీమిండియా పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌కు మరోసారి సెలక్టర్లు మొండిచేయి చూపించారు. వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించిన సెలక్టర్లు.. అర్ష్‌దీప్‌ సింగ్‌ను ఎంపిక చేయలేదు. అర్ష్‌దీప్‌ చివరగా వన్డేల్లో గతేడాది నవంబర్‌లో న్యూజిలాండ్‌పై ఆడాడు. కాగా అదే సిరీస్‌లో అర్ష్‌దీప్‌ వన్డేల్లో డెబ్యూ చేశాడు.

తన వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్‌ ఒక్క వికెట్‌ సాధించలేకపోయాడు. అయితే టీ20ల్లో మాత్రం ఈ లెఫ్ట్ఆర్మ్‌ పేసర్‌కు మంచి రికార్డు ఉంది. 26 టీ20 మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్‌.. 8.4 ఏకానమితో 41 వికెట్లు పడగొట్టాడు.

కాగా ఈ ఏడాది వన్డే ప్రపచంకప్‌ జరగనున్న నేపథ్యంలో  అర్ష్‌దీప్‌ వంటి స్పీడ్‌ స్టార్‌ను విండీస్‌తో వన్డేలకు ఎంపిక చేసి ఉంటే బాగుండేది అని చాలా మంది అభిప్రాయపడతున్నారు. డెత్‌ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ చేసే సత్తా అర్ష్‌దీప్‌కు ఉంది. 

విండీస్‌ సిరీస్‌కు ఎంపికైన ఉమ్రాన్‌ మాలిక్‌, జయదేవ్‌ ఉనద్కట్‌ వంటి పేసర్లతో పోలిస్తే అర్షదీప్‌ ఎంతో బెటర్‌ అని నెటిజన్లు సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. "మొదటలో యార్కర్ల కింగ్‌ అని ఆకాశానికి ఎత్తారు.. ఇప్పడమో ఏకంగా జట్టు నుంచి పక్కన పెట్టారని" ఓ యూజర్‌ ట్వీట్‌ చేశాడు.

ఇక అర్షదీప్‌ ప్రస్తుతం ఇంగ్లండ్‌ కౌంటీల్లో బీజీబీజీగా ఉన్నాడు.  కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ 1లో కెంట్‌ క్రికెట్‌ క్లబ్‌కు అర్ష్‌దీప్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
చదవండి: IND vs WI: విండీస్‌తో టెస్టు సిరీస్‌.. రోహిత్‌ జోడిగా యశస్వీ జైశ్వాల్‌! మరి గిల్‌ సంగతి ఏంటి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement