బెంగళూరు: ఈ సిరీస్‌లోనే తక్కువ స్కోర్ల అంతిమ సమరం ఆఖరికొచ్చేసరికి ఉత్కంఠ రేపింది. గెలుపు ఇరుజట్లను దోబూచులాడిన తరుణంలో భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో గట్టెక్కింది. చివరిదైన ఐదో టి20 మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగులతో ఆ్రస్టేలియాను ఓడించి సిరీస్‌ను 4–1తో ముగించింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (37 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించగా, ఆఖర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్ (21 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లలో బెహ్రెన్‌డార్ఫ్, డ్వార్‌షుయిస్ చెరో 2 వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆ్రస్టేలియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులే చేసి ఓడింది. బెన్ మెక్‌డెర్మాట్ (36 బంతుల్లో 54; 5 సిక్సర్లు) రాణించాడు. ముకేశ్ (3/32), అర్ష్దీప్ (2/40) డెత్ ఓవర్ల లో నిప్పులు చెరిగారు. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ రవి బిష్ణోయ్ (2/29), అక్షర్ (1/14) బౌలింగ్ కూడా ఆస్ట్రేలియాను కట్టడి చేసింది.
ఆదుకున్న అయ్యర్
యశస్వి జైస్వాల్, రుతురాజ్‌లు ఆరంభంలో నెమ్మదించడంతో 3 ఓవర్లదాకా చెప్పుకోదగ్గ స్కోరేలేదు. ఎట్టకేలకు 4వ ఓవర్లో గైక్వాడ్ 4, జైస్వాల్ 4, 6 కొట్టి ఊపు తెచ్చారు. కానీ అదే ఓవర్లో యశస్వి (21), మరుసటి ఓవర్లో రుతురాజ్ (10) నిష్క్రమించడంతో పవర్‌ప్లేలో భారత్ 42/2 స్కోరు చేసింది. కాసేపటికే కెపె్టన్ సూర్యకుమార్ (5), రింకూ సింగ్ (6)లు సైతం అవుట్ కావడంతో 55 పరుగులకే కీలకమైన 4 వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది.
ఈ దశలో అనుభవజు్ఞడైన శ్రేయస్ అయ్యర్ బాధ్యతగా ఆడి గౌరవప్రదమైన స్కోరుకు బాటవేశాడు. జితేశ్ శర్మ (16 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్‌లతో కలిసి జట్టు స్కోరును 150 పరుగులదాకా తీసుకొచ్చాడు. 36 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకొన్నాక అయ్యర్ అవుట్ కావడంతో డెత్ ఓవర్లలో ఆశించినన్ని పరుగులు రాలేదు.
రాణించిన మెక్‌డెర్మాట్
ఆసీస్ పవర్‌ప్లేలోనే ఓపెనర్లు జోష్ ఫిలిప్ (4), హెడ్ (18 బంతుల్లో 28; 5 ఫోర్లు, 1 సిక్స్) వికెట్లను కోల్పోయింది. హార్డీ (6) కూడా చేతులెత్తేయగా... వన్‌డౌన్ బ్యాటర్ బెన్ మెక్‌డెర్మాట్ బాధ్యతగా ఆడాడు. టిమ్ డేవిడ్ (17; 1 సిక్స్)తో కలిసి జట్టు స్కోరును 100 పరుగులు దాటించాడు. తర్వాత కాసేపటికే డేవిడ్ అవుట్ కాగా... 34 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న మెక్‌డెర్మాట్‌ను ఊరించే ఫుల్‌టాస్ బంతితో అర్ష్దీప్ బోల్తా కొట్టించాడు.
ముకేశ్ వరుస బంతుల్లో షార్ట్ (16), డ్వార్‌షుయిస్ (0)లను పెవిలియన్ చేర్చడంతో 129/7 స్కోరు వద్ద భారత్ పట్టుబిగించింది. 18 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన తరుణంలో అవేశ్ వేసిన 18వ మార్చేసింది. వేడ్ 3 వరుస బౌండరీలతో 15 పరుగులు వచ్చాయి.
మళ్లీ ముకేశ్ 19వ ఓవర్లో 7 పరుగులే ఇచ్చి భారత్‌వైపు మొగ్గేలా చేశాడు. చివరకు ఆసీస్ విజయానికి 6 బంతుల్లో 10 పరుగులు కావాలి. ఉత్కంఠ తారస్థాయికి చేరగా అర్ష్దీప్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో వేడ్ (15 బంతుల్లో 22; 4 ఫోర్లు) వికెట్ తీసి కేవలం 3 పరుగులే ఇవ్వడంతో భారత్ గెలిచి ఊపిరి పీల్చుకుంది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి) ఎలిస్ (బి) బెహ్రెన్‌డార్ఫ్ 21; రుతురాజ్ (సి) బెహ్రెన్‌డార్ఫ్ (బి) డ్వార్‌షుయిస్ 10; అయ్యర్ (బి) ఎలిస్ 53; సూర్యకుమార్ (సి) మెక్‌డెర్మాట్ (బి) డ్వార్‌షుయిస్ 5; రింకూ సింగ్ (సి) డేవిడ్ (బి) సంఘా 6; జితేశ్ (సి) షార్ట్ (బి) హార్డీ 24; అక్షర్ (సి) హార్డీ (బి) బెహ్రెన్‌డార్ఫ్ 31; రవి బిష్ణోయ్ (రనౌట్) 2; అర్ష్దీప్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–33, 2–33, 3–46, 4–55, 5–97, 6–143, 7–156, 8–160. బౌలింగ్: హార్డీ 4–0–21–1, బెహ్రెన్‌డార్ఫ్ 4–0–38–2, డ్వార్‌షుయిస్ 4–0–30–2, నాథన్ ఎలిస్ 4–0–42–1, తన్విర్ సంఘా 4–0–26–1.
ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హెడ్ (బి) బిష్ణోయ్ 28; ఫిలిప్ (బి) ముకేశ్ 4; మెక్‌డెర్మాట్ (సి) రింకూ (బి) అర్ష్దీప్ 54; హార్డీ (సి) అయ్యర్ (బి) బిష్ణోయ్ 6; టిమ్ డేవిడ్ (సి) అవేశ్ (బి) అక్షర్ 17; షార్ట్ (సి) రుతురాజ్ (బి) ముకేశ్ 16; వేడ్ (సి) అయ్యర్ (బి) అర్ష్దీప్ 22; డ్వార్‌షుయిస్ (బి) ముకేశ్ 0; ఎలిస్ (నాటౌట్) 4; బెహ్రెన్‌డార్ఫ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–22, 2–47, 3–55, 4–102, 5–116, 6–129, 7–129, 8–151. బౌలింగ్: అర్ష్దీప్ 4–0–40–2, అవేశ్ ఖాన్ 4–0–39–0, ముకేశ్ 4–0–32–3, రవి బిష్ణోయ్ 4–0–29–2, అక్షర్ 4–0–14–1.
That winning feeling 👏
— BCCI (@BCCI) December 3, 2023
Captain Suryakumar Yadav collects the trophy as #TeamIndia win the T20I series 4⃣-1⃣ 🏆#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/IuQsRihlAI
Comments
Please login to add a commentAdd a comment