
PC:tiwtter
ఐపీఎల్-2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. ముంబై విజయానికి ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు కావల్సిన నేపథ్యంలో పంజాబ్ కెప్టెన్ సామ్ కుర్రాన్ బంతిని అర్ష్‌దీప్ చేతికి ఇచ్చాడు. ఆఖరి ఓవర్ వేసిన అర్ష్‌దీప్ కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
ఈ ఓవర్‌లో రెండు వికెట్ల అర్ష్‌దీప్ రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. ముంబై తిలక్ వర్మ, వధేరాలను బౌల్డ్ చేశాడు. అయితే అర్ష్‌దీప్ వేసిన యార్కర్ల ధాటికి రెండు సందర్భాల్లోనూ మిడిల్ స్టంప్ విరిగి పోవడం విశేషం. అయితే అర్ష్‌దీప్ దెబ్బకు బీసీసీఐకి రూ. లక్షల్లో నష్టం వాటిల్లింది.
ఐపీఎల్‌లో జింగ్ బెయిల్స్ స్టంప్స్‌ను వాడుతున్న సంగతి తెలిసిందే. ఒక్కో వికెట్ సెట్ ఖరీదు దాదాపు 48 వేల డాలర్లు. అంటే భారత కరెన్సీలో సూమారు రూ. 40లక్షల అన్నమాట. అయితే ఇటువంటి సందర్భాల్లో వికెట్ సెట్‌మొత్తం మార్చేయాల్సి వస్తుంది. రెండు సార్లు అర్ష్‌దీప్ స్టంప్‌ను బ్రేక్ చేశాడు కాబట్టి బీసీసీ రూ. 80లక్షలు నష్టం వచ్చినట్లే అని చెప్పుకోవాలి.
"ఒక జత స్టంప్‌ల ధర సుమారు 48,000 డాలర్లు. ఇవి ఒక సెట్‌గా వస్తాయి. కాబట్టి ఒక స్టంప్ కూడా పాడైతే, సెట్ మొత్తం పనికిరాకుండా పోతుంది" అని న్యూజిలాండ్ బే ఓవల్ స్టేడియం అధికారి ఒకరు హిందూస్తాన్ టైమ్స్‌తో పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: రోహిత్ చేసిన తప్పు అదే.. పాపం అర్జున్ బలైపోయాడు! వీడియో వైరల్
Stump breaker,
— JioCinema (@JioCinema) April 22, 2023
Game changer!
Remember to switch to Stump Cam when Arshdeep Akram bowls 😄#MIvPBKS #IPLonJioCinema #IPL2023 #TATAIPL | @arshdeepsinghh pic.twitter.com/ZnpuNzeF7x
Comments
Please login to add a commentAdd a comment