ICC Mens T20 World Cup 2022 - India vs England, 2nd Semi-Final Updates In Telugu:
టీ20 ప్రపంచకప్-2022: రెండో సెమీ ఫైనల్- ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ అప్‌డేట్స్:
టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా పోరాటం ముగిసింది. ఆడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో భారత్ ఘోర పరాజయం పాలైంది.
తద్వారా టోర్నీ నుంచి రోహిత్ సేన నిష్క్రమించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. వికెట్ నష్టపోకుండా చేధించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్(80), అలెక్స్ హేల్స్(86) పరుగులతో ఇంగ్లండ్‌కు విజయాన్ని అందించారు.
►ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఇంగ్లండ్ ఓపెనర్లు
బట్లర్ 56, హేల్స్ 80 పరుగులతో క్రీజులో ఉన్నారు. 13 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 140/0
► 11 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 108 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్(38), హేల్స్(66) పరుగులతో ఉన్నారు.
►9 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 91 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్(36), హేల్స్(51) పరుగులతో ఉన్నారు.
పవర్ ప్లేలో దూకుడు
ఇంగ్లండ్ ఓపెనర్ల దూకుడుకు భారత బౌలర్లు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. దీంతో పవర్ ప్లేలో ఇంగ్లండ్ 63 పరుగులతో దూకుడు కొనసాగిస్తోంది.
దాటిగా ఆడుతున్న బట్లర్
ఇంగ్లండ్ కెప్టెన్, ఓపెనర్ జోస్ బట్లర్(14 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 24 పరుగులు) దాటిగా ఆడుతున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తున్నాడు. మరోవైపు అలెక్స్ హేల్స్ సహకారం అందిస్తున్నాడు. ఈ క్రమంలో 4 ఓవర్లలో ఇంగ్లండ్ 41 పరుగులు చేసింది.
టీమిండియా స్కోరెంతంటే
ఇంగ్లండ్‌తో రెండో సెమీ ఫైనల్లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కోహ్లి 50, హార్దిక్ పాండ్యా 63 పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్‌కు మూడు, ఆదిల్ రషీద్‌కు ఒకటి, క్రిస్ వోక్స్‌కు ఒక వికెట్ దక్కాయి.
హిట్ వికెట్‌గా వెనుదిరిగిన హార్దిక్ పాండ్యా
అద్భుత అర్ధ శతకంలో చెలరేగిన హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు.
పంత్ రనౌట్
సూపర్ పాండ్యా
హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీతో మెరిశాడు. 29 బంతుల్లో 52 పరుగులు రాబట్టాడు. 19 ఓవర్లలో టీమిండియా స్కోరు: 156/4
కోహ్లి అవుట్
అర్ధ శతకం పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లి జోర్డాన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 50 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. పాండ్యా, పంత్ క్రీజులో ఉన్నారు. 18 ఓవర్లలో టీమిండియా స్కోరు: 136/4
పాండ్యా మెరుపులు
జోర్డాన్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదిన హార్దిక్ పాండ్యా
17 ఓవర్లలో టీమిండియా స్కోరు: 121/3
►అర్ధ శతకానికి చేరువలో కోహ్లి (48). 16 ఓవర్లలో స్కోరు: 110-3
తప్పిన ఎల్బీడబ్ల్యూ ప్రమాదం.. కోహ్లి నాటౌట్
16 వ ఓవర్ రెండో బంతికి జోర్డాన్ బౌలింగ్‌లో కోహ్లికి ఎల్బీడబ్ల్యూ ప్రమాదం తప్పింది.
నెమ్మదిగా సాగుతున్న టీమిండియా ఇన్నింగ్స్
15 ఓవర్లలో వంద పరుగులు మార్కు అందుకున్న టీమిండియా. స్కోరు: 100/3
►14 ఓవర్లలో టీమిండియా స్కోరు: 90-3
కోహ్లి(38), హార్దిక్ పాండ్యా(4) క్రీజులో ఉన్నారు
►75 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. రషీద్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
►రోహిత్ శర్మ రూపంలో రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 38/1
►5 ఓవర్లలో టీమిండియా స్కోరు: 31-1
►కోహ్లి, రోహిత్ శర్మ క్రీజులో ఉన్నారు. స్కోరు: 11/1 (2.3 ఓవర్లలో)
► తొలి వికెట్ కోల్పోయిన ఇండియా.. కేఎల్ రాహుల్ అవుట్
►టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
తుది జట్లు:
భారత్:
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్
ఇంగ్లండ్:
జోస్ బట్లర్(కెప్టెన్/వికెట్ కీపర్), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్
ఇంగ్లండ్‌తో టీమిండియా ఢీ
టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ ఫైనల్‌కు అర్హత సాధించేందుకు టీమిండియా సమాయత్తమైంది. అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో సెమీ ఫైనల్లో గురువారం అమీ తుమీ తేల్చుకోనుంది. ఇక ఇప్పటికే మొదటి సెమీస్ మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్.. న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో టీమిండియా సైతం ఇంగ్లండ్‌ను మట్టికరిపించి తుది పోరుకు అర్హత సాధించి 2007 నాటి సెంటిమెంట్ రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా మొదటి టీ20 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో ధోని సేన పాక్‌ను ఓడించి టైటిల్ గెలిచిన విషయం విదితమే.
చదవండి: Rohit Sharma- Jos Buttler: ఇంగ్లండ్ జట్టు ప్రమాదకరమైంది.. మేం గెలవాలంటే!
Comments
Please login to add a commentAdd a comment