
ఆడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైన్లలో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. దీంతో టీ20 ప్రపంచకప్-2022 నుంచి భారత జట్టు ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పర్వాలేదనిపించినప్పటికీ.. బౌలర్లు మాత్రం తీవ్ర నిరాశపరిశారు.
ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క వికెట్ కూడా భారత బౌలర్లు సాధించలేపోయారు. ఏ దశలోను భారత బౌలర్లు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. దీంతో 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. వికెట్ నష్టపోకుండా 16 ఓవర్లలోనే ఛేదించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు బట్లర్(80), హేల్స్(86) పరుగులతో ఆజేయంగా నిలిచి జట్టుకు ఘన విజయాన్ని అందించారు.
కన్నీరు పెట్టుకున్న రోహిత్
టోర్నీ నిష్రమించడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగానికి లోనయ్యాడు. మ్యాచ్ అనంతరం డగౌట్‌లో కూర్చోని రోహిత్ కన్నీరు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఆదివారం (నవంబర్ 13)న మెల్‌బోర్న్ వేదికగా జరగనున్న ఫైనల్లో పాకిస్తాన్‌తో ఇంగ్లండ్ తలపడనుంది.
— Aditya Kukalyekar (@adikukalyekar) November 10, 2022
చదవండి: Rohit Sharma: తీవ్ర నిరాశకు లోనయ్యాం.. మా ఓటమికి ప్రధాన కారణం అదే.. క్రెడిట్ వాళ్లకే!