టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే పేసర్ షాహీన్ షా ఆఫ్రిది గాయం కారణంగా మ్యాచ్ మధ్యలో వైదొలగడం తమ జట్టు ఓటమికి ప్రధాన కారణమని పాక్ కెప్టెన్ బాబర్ ఆజం చెప్పుకొచ్చాడు. కాగా బాబర్ చేసిన ఈ వాఖ్యలను భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తోసిపుచ్చాడు. ఆఫ్రిది ఫీల్డ్‌లో ఉన్నా ఇంగ్లండ్ ఖచ్చితంగా విజయం సాధించేది అని గవాస్కర్ తెలిపాడు.
ఇండియా టుడేతో గవాస్కర్ మాట్లాడుతూ.. "షాహిన్ ఆఫ్రిది గాయం పాకిస్తాన్ ఓటమికి ప్రధాన కారణం కాదు. ఎందుకంటే పాకిస్తాన్ తొలత బ్యాటింగ్‌లో అంతగా రాణించలేకపోయింది. వారు 15 నుంచి 20 పరుగులు ఆదనంగా చేసే ఉంటే బాగుండేది. అప్పడు బౌలర్లపై అంత ఒత్తిడి ఉండేది కాదు.
అయితే ఈ మ్యాచ్‌లో షాహీన్ ఫీల్డ్‌ను వదిలేటప్పటికీ అతడికి కేవలం 11 బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ 11 బంతులు ఇంగ్లండ్‌పై ఎటువంటి ప్రభావం చూపకపోయండేవి. బహుశా పాకిస్తాన్‌కి మరో వికెట్ లభించి ఉండవచ్చు. అంతే తప్ప ఇంగ్లండ్ మాత్రం కచ్చితంగా గెలిచి ఉండేది" అని అతడు పేర్కొన్నాడు. కాగా ఫైనల్లో 2.1 ఓవర్లు బౌలింగ్ చేసిన ఆఫ్రిది 13 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. కాగా ఆఫ్రిది మెకాలి గాయం తిరగబెట్టడంతో మరో ఆరు నెలల పాటు జట్టుకు దూరం ఉండనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: Pak Vs Eng: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో భారీ షాక్! ‘ఆర్నెళ్ల పాటు..!’
Comments
Please login to add a commentAdd a comment