టీ20 ప్రపంచకప్-2022 సెమీస్‌లో ఇంటిముఖం పట్టిన న్యూజిలాండ్.. స్వదేశంలో టీమిండియాతో వైట్‌బాల్ సిరీస్‌లో తలపడనుంది. ఈ హోమ్ సిరీస్‌లో భాగంగా టీమిండియాతో న్యూజిలాండ్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇప్పటికే ఈ పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్‌కు భారత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ దూరమయ్యారు.
ఇక న్యూజిలాండ్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. టీ20, వన్డే సిరీస్‌లకు రెండు వేర్వేరు జట్లను న్యూజిలాండ్ క్రికెట్ ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే టీ20 సిరీస్‌కు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, సీనియర్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. వీరి స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
అదే విధంగా గత కొంత కాలంగా వైట్ బాల్ క్రికెట్‌కు దూరంగా ఉన్న టామ్ లాథమ్, నికోల్స్ తిరిగి జట్టులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా నవంబర్ 18న వెల్లింగ్టన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో భారత్ టూర్ ప్రారంభం కానుంది.
న్యూజిలాండ్ పర్యటనకు భారత టీ20 జట్టు..
హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
న్యూజిలాండ్ పర్యటనకు భారత వన్డే జట్టు..
శిఖర్ ధవన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్ , శార్ధూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్
చదవండి: Cricket Australia: టీ20 వరల్డ్ కప్ బెస్ట్ టీమ్.. వాళ్లకు మాత్రం స్థానం లేదు! హవా ఎవరిదంటే!
Comments
Please login to add a commentAdd a comment