రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో హార్దిక్ పాండ్యా
India tour of New Zealand, 2022- Hardik Pandya: టీమిండియాను ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ చేసిన వ్యాఖ్యలపై భారత ఆల్‌రౌండర్, తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. భారత జట్టు ఇంకా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదంటూ కౌంటర్ ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో సెమీస్‌లోనే నిష్క్రమించడం నిరాశ కలిగించిన మాట వాస్తమని.. అయితే ఆటలో ఇవన్నీ సహజమేనని పేర్కొన్నాడు. పొరపాట్లు సరిచేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నాడు.
టీమిండియా చెత్త ప్రదర్శన అంటూ
కాగా వరల్డ్‌కప్-2022 రెండో సెమీ ఫైనల్లో టీమిండియాను ఓడించిన ఇంగ్లండ్.. ఫైనల్లో పాకిస్తాన్‌ను చిత్తు చేసి చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరుగనున్న మరో ఐసీసీ టోర్నమెంట్‌కు క్రికెట్ జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ది టెలిగ్రాఫ్‌నకు రాసిన కాలమ్‌లో మైఖేల్ వాన్.. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023 జరుగనున్నప్పటికీ టీమిండియా ఎప్పటికీ ఫేవరెట్ కాలేదని విమర్శించాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా ప్రదర్శన అస్సలు బాగాలేదని.. చరిత్రలో ఇంత చెత్తగా ఎవరూ ఆడలేదని.. ఇంగ్లండ్‌ను చూసి నేర్చుకోవాలంటూ అవాకులు చెవాకులు పేలాడు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే అక్కడికి చేరుకున్న విషయం తెలిసిందే.
వాన్‌కు కౌంటర్ ఇచ్చిన హార్దిక్!
ఈ నేపథ్యంలో టీ20 సిరీస్‌కు సారథిగా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యా.. మైకేల్ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించాడు. ‘‘మా పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతాం. అంతేగానీ ఎవరి ముందో మేము ఇంకా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు.
ఈ టూర్‌లో కీలక ఆటగాళ్లు లేరు. యువకులకు ఈ సిరీస్ చక్కని అవకాశం. మా జట్టులో ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. గత ఏడాది, ఏడాదిన్నర కాలంగా జట్టుకు ఆడుతున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో తమను తాము నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త జట్టు, కొత్త ఉత్సాహం.. నూతనోత్తేజం.. ఈ సిరీస్ కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాం’’ అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా న్యూజిలాండ్‌లో మూడు టీ20, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.
చదవండి: India tour of New Zealand: టీమిండియా న్యూజిలాండ్ పర్యటన.. పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, ఇతర వివరాలు
Kane Williamson: నన్ను రిలీజ్ చేస్తారని ముందే తెలుసు.. అయినా హైదరాబాద్‌తో: కేన్ మామ భావోద్వేగం
Comments
Please login to add a commentAdd a comment