
PC: BCCI TWITTER
ఆడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో భారత్ ఓటమిపాలైంది. దీంతో టీ20 ప్రపంచకప్-2022 నుంచి టీమిండియా నిష్ర్రమించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా చేధించింది.
ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్(80), హేల్స్ ఆజేయంగా నిలిచి జట్టుకు మరుపురాని విజయాన్ని అందించారు. ఇక తొలుత బ్యాటింగ్‌లో రాణించిన భారత్.. బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో కూడా చిన్న చిన్న తప్పిదాలు కూడా టీమిండియా ఫీల్డర్లు చేశారు.
సీరియస్ అయిన రోహిత్ శర్మ
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 9 ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో బట్లర్ ఫైన్ లెగ్ దిశగా స్కూప్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో ఫైన్ లెగ్ ఫీల్డింగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న షమీ పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని అందుకున్నాడు. అయితే బంతిని అందుకున్న షమీ నేరుగా త్రో చేయకుండా.. బంతి కోసం వచ్చిన భువనేశ్వర్ కుమార్‌కు అందించే ప్రయత్నం చేశాడు.
కానీ షమీ వేసిన త్రో భువీకి అందలేదు. దీంతో ఇంగ్లండ్ బ్యాటర్లు నాలుగు పరుగులు పూర్తి చేశారు. ఈ క్రమంలో హార్దిక్‌తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రోహిత్ మాత్రం తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు. షమీని చూస్తూ నేరుగా నీవే త్రో చేయవచ్చు కదా అంటూ గట్టిగా ఆరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Lol, what were they thinking 😂#indiavsengland #ICCT20WorldCup2022 #shami pic.twitter.com/OT14YIr8dj
— Mouli (@Mouli_07) November 10, 2022
చదవండి: Rohit Sharma Crying: ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి.. కన్నీరు పెట్టుకున్న రోహిత్ శర్మ