T20 WC 2022 Final Pak Vs Eng: Trolls On Babar Azam 1992 Memes - Sakshi
Sakshi News home page

T20 WC 2022 Final: 1992 సెంటిమెంట్‌ రిపీట్‌ అవుతుందన్నావు కదా బాబర్‌! ఇప్పుడేమంటావు?

Published Sun, Nov 13 2022 6:07 PM | Last Updated on Sun, Nov 13 2022 7:24 PM

T20 WC 2022 Final Pak Vs Eng: Trolls On Babar Azam 1992 Memes - Sakshi

ICC Mens T20 World Cup 2022- Pakistan vs England, Final: ‘‘చరిత్ర పునరావృతం కాబోతోంది.. ట్రోఫీ గెలుస్తాం..’’.. టీ20 ప్రపంచకప్‌-2022 ఫైనల్లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం చేసిన వ్యాఖ్యలు. టాస్‌ సమయంలో అతడు మాట్లాడుతూ.. 1992 నాటి సెంటిమెంట్‌ రిపీట్‌ అవుతుందంటూ జోస్యం చెప్పాడు. కానీ.. నాటి ఆ సెంటిమెంట్‌ ఇప్పుడు పాకిస్తాన్‌ జట్టుకు కలిసి రాలేదు. పటిష్టమైన జట్టుగా పేరున్న ఇంగ్లండ్‌ పొట్టి ఫార్మాట్‌లో తమ సత్తా చాటుతూ విశ్వవిజేతగా నిలిచింది.

తద్వారా మూడోసారి ఐసీసీ ట్రోఫీ గెలిచి సగర్వంగా తాజా టోర్నీని ముగించింది. మెల్‌బోర్న్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకోగా.. అతడి నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు అద్భుతంగా రాణించారు. పాక్‌ను 137 పరుగులకే కట్టడి చేశారు. లక్ష్య ఛేదనలో పాక్‌ బౌలర్లు కాసేపు ఇంగ్లండ్‌ను భయపెట్టినా.. ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ వాళ్ల ఆటలు సాగనివ్వలేదు.

వికెట్‌ పడకుండా జాగ్రత్త పడుతూనే అర్ధ శతకం(52 పరుగులు) సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో 2010 తర్వాత ఇంగ్లండ్‌కు మరోసారి టీ20 వరల్డ్‌కప్‌ ట్రోఫీ దక్కింది. ఇక 2009లో చాంపియన్‌గా నిలిచిన పాకిస్తాన్‌ మరోసారి కప్‌ అందుకోవాలని భావించగా వాళ్లకు నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో టాస్‌ సమయంలో బాబర్‌ మాటలను ఉద్దేశించి నెటిజన్లు అతడిని ట్రోల్‌ చేస్తున్నారు.

‘‘సెంటిమెంట్లు నమ్ముకుంటే పనికాదని ఇప్పటికైనా అర్థమైందా? టీమిండియా గురించి మీ వాళ్లు మాట్లాడిన మాటలు ఇప్పుడేమయ్యాయి. అయినా ప్రతిసారి లక్‌ కలిసి రాదు. నెదర్లాండ్స్‌ సౌతాఫ్రికాను ఓడించి ఉండకపోతే అసలు సెమీస్‌ దాకా కూడా వచ్చేవాళ్లు కాదు! ఇకనైనా ప్రగల్భాలు మాని ఆటపై దృష్టి పెట్టండి’’ అంటూ హితవు పలుకుతున్నారు.

నీ బెస్ట్‌ కోహ్లి వరస్ట్‌ కంటే కూడా వేస్ట్‌
కాగా 1992 వన్డే వరల్డ్‌కప్‌ మాదిరే టీ20 ప్రపంచకప్‌ ఎనిమిదో ఎడిషన్‌లోనూ పాక్‌కు పరిస్థితులు అనుకూలంగా కనిపించాయి. దీంతో ఇమ్రాన్‌ ఖాన్‌ మాదిరి బాబర్‌ ఆజం కూడా ఐసీసీ ట్రోఫీ గెలుస్తాడంటూ పాక్‌ ఫ్యాన్స్‌ ఆశపడగా.. బట్లర్‌ బృందం వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఇక ఈ మ్యాచ్‌లో బ్యాటర్‌గానూ బాబర్‌ ఆజం తన స్థాయికి తగ్గట్లు రాణించలేదు. 28 బంతుల్లో 32 పరుగులు చేశాడు.

దీంతో టీమిండియా బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి రికార్డులు బ్రేక్‌ చేస్తున్నాడంటూ ప్రశంసలు అందుకున్న బాబర్‌.. ఈ టోర్నీలో కోహ్లి క్లిక్‌ అయితే, అతడు మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. నిజానికి కోహ్లి వరస్ట్‌ ఇన్నింగ్స్‌ కంటే కూడా బాబర్‌ ఆజం బెస్ట్‌ ఇన్నింగ్స్‌ దారుణంగా ఉంది’’ అంటూ ట్రోలింగ్‌కు దిగారు మరికొంతమంది. 

చదవండి: Chris Jordan: ఒకసారి అంటే పర్లేదు.. రెండోసారి కూడా అదే తప్పు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement