
ICC Mens T20 World Cup 2022- Pakistan vs England, Final: ‘‘మేము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనే అనుకున్నాం. కానీ టాస్ మా చేతుల్లో లేదు కదా! కాబట్టి ఇప్పుడు వీలైనన్ని పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తాం. వాళ్లను ఒత్తిడిలోకి నెట్టేస్తాం. మా జట్టు ఆట తీరు బాగుంది. ఫైనల్లో కూడా మేము దానిని కొనసాగిస్తాం. ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లలో మేము ఓడిపోయినప్పటికీ.. ఫైనల్ వరకు చేరుకోగలగడం సానుకూల అంశం.
జట్టుగా వందకు వంద శాతం గెలుపు కోసం కష్టపడుతూనే ఉన్నాం. చరిత్ర పునరావృతం కాబోతోంది. ఈ మ్యాచ్ గెలిచి కప్ గెలిచేందుకు మా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాం’’ అని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అన్నాడు. 1992 వరల్డ్‌కప్ టోర్నీ మాదిరి పాకిస్తాన్ ఈసారి పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ ట్రోఫీ అందుకోబోతుందంటూ విశ్వాసం వ్యక్తం చేశాడు.
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో పాకిస్తాన్.. ఇంగ్లండ్‌తో తలపడుతోంది. ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బాబర్ ఆజం బృందాన్ని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ నేపథ్యంలో టాస్ సమయంలో బాబర్ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. సెమీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడిన జట్టుతోనే ఫైనల్ ఆడనున్నట్లు తెలిపాడు.
ఇక బట్లర్ మాట్లాడుతూ.. కఠిన సవాలుకు తాము సిద్ధమయ్యామని, వాతావరణం దృష్ట్యా తొలుత బౌలింగ్ ఎంచుకున్నట్లు వెల్లడించాడు. ఇక తాము సైతం టీమిండియాతో రెండో సెమీ ఫైనల్లో తలపడ్డ జట్టుతోనే బరిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్-2022: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్
పాకిస్తాన్ తుది జట్టు:
బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది.
ఇంగ్లండ్:
జోస్ బట్లర్(వికెట్ కీపర్/ కెప్టెన్), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్.
చదవండి: T20 WC 2022: ఫైనల్‌కు ముంగిట ఇంగ్లండ్ జట్టుకు బ్యాడ్ న్యూస్
Comments
Please login to add a commentAdd a comment