హార్దిక్ పాండ్యా (PC: ICC Twitter)
ICC Mens T20 World Cup 2022- India vs England, 2nd Semi-Final: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్‌తో రెండో సెమీ ఫైనల్లో టీమిండియా బ్యాటర్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా అర్ధ శతకాలు సాధించారు. కోహ్లి 40 బంతుల్లో 50 పరుగులు సాధించగా.. పాండ్యా 33 బంతుల్లో 5 సిక్స్‌లు, 4 ఫోర్ల సాయంతో 63 పరుగులు రాబట్టాడు.
అడిలైడ్ మ్యాచ్‌లో కోహ్లి ఆచితూచి ఆడగా.. పాండ్యా దూకుడు ప్రదర్శించాడు. వీరిద్దరి కారణంగా టీమిండియా మెరుగైన స్కోరు చేయగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కాగా గురువారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే, ఇంగ్లండ్ బౌలర్లు ఆది నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పవర్ ప్లేలో పరుగులు రాబట్టలేక టీమిండియా ఇబ్బంది పడింది.
మొదటి ఓవర్ నాలుగో బంతికే ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను క్రిస్ వోక్స్ పెవిలియన్‌కు పంపాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ, వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆచితూచి ఆడారు. ఈ క్రమంలో 6 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు వికెట్ నష్టానికి 38 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన సూర్యకుమార్ యాదవ్ 14 పరుగులకే అవుటయ్యాడు.
ఈ క్రమంలో కోహ్లితో కలిసి హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. దూకుడుగా ఆడుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఇక పంత్ 6 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆఖర్లో పాండ్యా హిట్ వికెట్‌గా వెనుదిరగడం గమనార్హం.ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
చదవండి: WC 2022 Final: ఫైనల్లో టీమిండియాతో పోరుకు సిద్ధమేనా? పాక్ కెప్టెన్ ఏమన్నాడంటే
Danushka Gunathilaka: మృగంలా ప్రవర్తించిన శ్రీలంక క్రికెటర్, రక్షణ కూడా లేకుండా అమానుషంగా
Comments
Please login to add a commentAdd a comment