Ind vs NZ: "Give Him A Break And Tell Him", Kris Srikkanth Fires Huge Warning to India - Sakshi
Sakshi News home page

WC 2023: ‘పాపం పంత్‌’.. తప్పంతా వాళ్లదే! కొన్నాళ్లు అతడికి బ్రేక్‌ ఇచ్చి: టీమిండియా మాజీ కెప్టెన్‌

Published Mon, Nov 28 2022 10:30 AM | Last Updated on Mon, Nov 28 2022 11:07 AM

Ind Vs NZ: Kris Srikkanth Fires Huge Warning To Team India Give Him Break - Sakshi

రిషభ్‌ పంత్‌

India tour of New Zealand, 2022- ‘‘ముందు అతడికి బ్రేక్‌ ఇవ్వండి. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ జట్టులోకి రావొచ్చని చెప్పండి. నిజానికి మేనేజ్‌మెంట్‌ తన విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతోంది’’ అని టీమిండియా యువ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ను ఉద్దేశించి భారత మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీలో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం వచ్చినప్పటికీ పంత్‌ పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే.

వరుస వైఫల్యాలు.. అయినా అవకాశాలు
అయినప్పటికీ, న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడే అవకాశం దక్కించుకున్న ఈ వికెట్‌ కీపర్‌ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. మెగా ఈవెంట్‌ అనంతరం కివీస్‌లో పర్యటనలో భాగంగా భారత జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా ఎంపికైన అతడు.. టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లలో ఓపెనర్‌గా చేసిన స్కోర్లు.. వరుసగా 6, 11.

ఇక ఆరంభ వన్డేలో నాలుగో స్థానంలో వచ్చి 15 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు.. మరో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ ఈ మ్యాచ్‌లో 36 పరుగులు చేశాడు. అయినప్పటికీ అతడికి రెండో వన్డలో చోటు దక్కలేదు.

ఈ నేపథ్యంలో పంత్‌పై విమర్శల వర్షం కురిపిస్తూ.. సంజూకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ఫ్యాన్స్‌ బీసీసీఐ తీరుపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో.. మాజీ చీఫ్‌ సెలక్టర్‌ శ్రీకాంత్‌ పంత్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్‌ తనను పూర్తిగా నిరాశపరిచాడని పేర్కొన్నాడు.


క్రిష్ణమాచారి శ్రీకాంత్‌

తప్పు పంత్‌ది కాదు! ఎన్నడరా ఇది..
‘‘రిషభ్‌ పంత్‌ విషయంలో మేనేజ్‌మెంట్‌ సరిగా లేదు. అతడిని సరిగ్గా హాండిల్‌ చేయలేకపోతున్నారు. తనకు కొంతకాలం బ్రేక్‌ ఇవ్వొచ్చు కదా! ఇంకో రెండు మూడు మ్యాచ్‌లలోనూ ఇలాగే వైఫల్యం చెందితే.. ఆ తర్వాత విశ్రాంతినివ్వడం లేదంటే పూర్తిగా పక్కన పెట్టేయడం చేస్తారా? 

నిజానికి రిషభ్‌ పంత్‌కు యాజమాన్యం ఎన్నో అవకాశాలు ఇచ్చింది. కానీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో అతడు విఫలమవుతున్నాడు. అతడి ఆట తీరు నన్ను పూర్తిగా నిరాశ పరిచింది. ఎన్నడ పంతూ ఇది’’ అని చిక్కా.. పంత్‌ పట్ల మేనేజ్‌మెంట్‌ వైఖరిని విమర్శించాడు. 

లోపాల్ని సరిదిద్దుకుంటేనే..
‘‘నీకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటే ఎంతో బాగుండేది. ఒకవేళ ఈ మ్యాచ్‌లలో నువ్వు మెరుగ్గా స్కోరు చేసి ఉంటే.. మున్ముందు మరిన్ని కీలక మ్యాచ్‌లు ఆడే ఛాన్స్‌ వస్తుంది. వచ్చే ఏడాది వరల్డ్‌కప్‌ టోర్నీ ఉంది కదా! 

ఇప్పటికే చాలా మంది.. ‘‘పంత్‌ అస్సలు సరిగ్గా ఆడటం లేదు.. అతడికి జట్టులో చోటు అవసరమా?’’ అంటూ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. ఇలాంటి సమయంలో నీపై ఒత్తిడి పెరగడం సహజం. కాబట్టి లోపం ఎక్కడ ఉందో నీకు నీవుగా తెలుసుకో! ప్రతిసారి ఎందుకు అంత తొందరగా వికెట్‌ పారేసుకోవాల్సి వస్తుందో ఆలోచించుకో’’ అని మాజీ ఓపెనర్‌ శ్రీకాంత్‌ యూట్యూబ్‌ వేదికగా పంత్‌కు సలహాలిచ్చాడు.  

చదవండి: Ind Vs NZ: అసలేం చేస్తున్నారు.. టీమిండియాను భ్రష్టు పట్టించకండి: నెహ్రా ఘాటు వ్యాఖ్యలు! కోచ్‌గా లక్ష్మణ్‌..
ICC WC Super League: వర్షం చేసిన మేలు! టాప్‌లో టీమిండియా.. లంకకు షాకిచ్చి ముందుడుగు వేసిన అఫ్గనిస్తాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement