టీ20 ప్రపంచకప్-2022లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. సెమీస్‌తో తమ ప్రయాణాన్ని ముగించింది. గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ఓటమి పాలై భారత జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో భారత మాజీ ఆటగాళ్లతో పాటు ఇతర దేశాల మాజీ క్రికెటర్లు కూడా టీమిండియాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
కాగా ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర హేల్స్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. బిగ్‌బాష్ లీగ్‌లో ఆడిన అనుభవం తనకు బాగా కలిసొచ్చిందిని తెలిపాడు. ఇక ఇదే ప్రశ్న భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కూడా ఎదురైంది.
దీనిపై అతడు స్పందిస్తూ.. "బిగ్ బాష్ లీగ్‌లో ఆడిన అనుభం ఇంగ్లండ్ ఆటగాళ్లకు కలిసిచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ భారత ఆటగాళ్లు విదేశీ లీగుల్లో ఆడడం చాలా కష్టం. ఎందుకంటే దేశీవాళీ టోర్నీలతో పాటు అంతర్జాతీయ సిరీస్‌లతో టీమిండియా బీజీబీజీగా ఉంటుంది. దీంతో భారత ఆటగాళ్లకు ఆ అవకాశం లేదు. అయితే విదేశీ లీగ్‌ల్లో మా ఆటగాళ్ల ఆడడంపై తుది నిర్ణయం బీసీసీఐదే" అని ద్రవిడ్ తెలపాడు.
ఇక ద్రవిడ్ చేసిన వాఖ్యలపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ వ్యంగ్యంగా స్పందించాడు. "ఏ స్పోర్ట్స్" ఛానల్ డిబేట్‌లో అతడు మాట్లాడుతూ.. "ఐపీఎల్ భారత జట్టుకు లాభం చేకూరుతుందని అందరూ అభిప్రాయపడ్డారు.
కానీ 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క టీ20 ప్రపంచకప్‌ను కూడా గెలవలేకపోయారు. ఇప్పుడు ఏం లాభం చేకూరుంది మరి? విదేశీ లీగ్‌ల్లో ఆడటానికి అనుమతిస్తే అయినా టీమిండియా ఆడే విధానం మారుతుందా అన్న సందేహం నెలకొంది" అని అక్రమ్ పేర్కొన్నాడు. ఇక ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా జరగనున్న ఫైనల్లో ఇంగ్లండ్‌తో పాకిస్తాన్ తలపడనుంది.
చదవండి: T20 WC 2022 Final: ఇంగ్లండ్- పాక్ ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దు అయితే?
Comments
Please login to add a commentAdd a comment