Suryakumar Yadav Special Birthday Wishes To His Wife Devisha Shetty, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Suryakumar Yadav: పచ్చబొట్టేసినా పిల్లదానా!.. నువ్వు లేకుంటే ఏమైపోయేవాడినో!

Published Thu, Nov 17 2022 5:07 PM | Last Updated on Thu, Nov 17 2022 6:53 PM

Suryakumar Yadav Birthday Wish For Devisha Shetty Pic Viral - Sakshi

సూర్యకుమార్‌ యాదవ్‌- దేవిశా శెట్టి (PC: Suryakumar Yadav Instagram)

Suryakumar Yadav- Devisha Shetty: ‘‘నా అందమైన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా ప్రపంచం.. సమస్యల నుంచి గట్టెక్కించే నా ప్రియనేస్తం. నాలో స్ఫూర్తిని నింపుతూ ముందుకు సాగేలా.. కెరీర్‌పై దృష్టి పెట్టేలా ప్రోత్సహించే వ్యక్తి. ఒకవేళ నువ్వు నా జీవితంలో లేకుంటే నేను ఏమైపోయేవాడినో! నా జీవితంలో నాకు దక్కిన విలువైన బహుమతి’’ అంటూ టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ భార్య దేవిశా శెట్టిపై ప్రేమను కురిపించాడు.

దేవిశా బర్త్‌డే సందర్బంగా ఆమెతో దిగిన ఫొటోను షేర్‌ చేసిన సూర్య.. తన సతీమణికి శుభాకాంక్షలు తెలియజేశాడు. కాగా సూర్యకుమార్‌- దేవిశాలది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే. ముంబై కాలేజీలో చదువుతున్న సమయంలో  2012లో తొలిసారిగా దేవిశాను కలిశాడు సూర్య.

డ్యాన్స్‌ని చూసి ఫిదా
ఆమె డ్యాన్స్‌ని చూసి ఫిదా అయ్యాడు. అప్పటికి దేవిశా వయసు 17 ఏళ్లు. సూర్యకు ఇరవై. ఆమెతో పరిచయం పెంచుకున్న సూర్య.. స్నేహితుడిగా మారి ప్రేమను గెలుచుకున్నాడు. ఐదేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దలను ఒప్పించి 2016లో వివాహం చేసుకున్నారు. 

ఇక తన ప్రతి విజయంలోనూ దేవిశా ప్రోత్సాహం ఉందంటూ సూర్య పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో రాణిస్తున్న సమయంలో టీమిండియాలో చోటు కోసం ఎదురుచూసినపుడు ఏమాత్రం నిరాశకు లోనుకాకుండా తనలో స్ఫూర్తి నింపేదని పేర్కొన్నాడు.

పచ్చబొట్టేసినా పిల్లదానా!
భార్యపై ప్రేమను చాటుకోవడంలో ముందుండే సూర్య ఇలా పుట్టినరోజున ఆమెకు ఇలా విషెస్‌ చెప్పాడు. కాగా భార్యను తన పంచప్రాణాలుగా భావించే సూర్య కుమార్‌.. గుండెపై ఆమె పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నాడట మరి! 

ఇక ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీ సందర్భంగా పొట్టి ఫార్మాట్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ 1గా నిలిచి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు సూర్య. ఈ మెగా ఈవెంట్‌లో టాప్‌ రన్‌స్కోరర్‌ విరాట్‌ కోహ్లి తర్వాత అత్యధిక పరుగులు సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌ పర్యటనతో బిజీగా ఉన్నాడు ఈ మిడిలార్డర్‌ బ్యాటర్‌.

చదవండి: IND vs NZ: బంతిని చూడకుండానే భారీ సిక్సర్‌.. శాంసన్‌తో అట్లుంటుంది మరి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement