మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్-2022 విజేతగా నిలిచింది. అయితే ఫైనల్లో పాక్ ఓటమిని ఆ దేశ మాజీ ఆటగాళ్లతో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఓటమి అనంతరం పాకిస్తాన్ దిగ్గజ పేసర్ ‘గుండె బద్ధలైంది’ అన్నట్టుగా ఎమోజీని ట్వీట్ చేశాడు.
అయితే అక్తర్ ట్వీట్‌పై భారత పేసర్ మహ్మద్ షమీ వ్యంగ్యంగా స్పందించాడు. ‘సారీ బ్రదర్... దీన్నే కర్మ ’ అంటారు అంటూ షమీ రిప్లే ఇచ్చాడు. కాగా సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై ఓటమి పాలై ఇంటిముఖం పట్టిన భారత జట్టును పాక్ మాజీలు హేళన చేశారు. "ఈ ఆటతీరుతో ప్రపంచకప్ ఫైనల్‌కు వస్తుందా.. పాక్‌తో తలపడే అర్హత టీమిండియాకు లేదంటూ " అక్తర్ కూడా విమర్శలు చేశాడు. దీనికి బదులుగా షమీ ఇప్పుడు గట్టి కౌంటర్ ఇచ్చాడు.
అదృష్టం కలిసొచ్చి సెమీస్‌కు
గ్రూప్ స్టేజీలోనే ఇంటి దారి పడుతోంది అనుకున్న పాకిస్తాన్ జట్టు అదృష్టం కలిసొచ్చి సెమీస్‌లో అడుగుపెట్టింది. నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓటమిపాలవ్వడంతో పాకిస్తాన్ లక్కీగా సెమీస్‌కు చేరుకుంది. అయితే సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై అనూహ్య విజయంతో పాక్ ఫైనల్లో అడుగుపెట్టింది. కానీ పటిష్టమైన ఇంగ్లండ్ ముందు పాక్ తలవంచింది. ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైన పాకిస్తాన్ రన్నరప్‌గా నిలిచింది.
Sorry brother
— Mohammad Shami (@MdShami11) November 13, 2022
It’s call karma 💔💔💔 https://t.co/DpaIliRYkd
చదవండి: T20 WC 2022: అప్పుడు వన్డే ప్రపంచకప్.. ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్! హీరో ఒక్కడే
Comments
Please login to add a commentAdd a comment