T20 WC IND Vs ENG Semi Final: Fans Trolls On KL Rahul Over His Low Score - Sakshi
Sakshi News home page

T20 WC 2022 IND Vs ENG: ఏంటి రాహుల్‌ నీ ఆట? వెంటనే జట్టు నుంచి తీసేయండి అంటూ!

Published Thu, Nov 10 2022 2:58 PM | Last Updated on Thu, Nov 10 2022 3:43 PM

KL Rahul Trolled On Twitter After Flopping In Semi final - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022లోభాగంగా ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో టీమిండియా స్టార్‌  ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ తీవ్ర నిరాశ పరిచాడు. కీలకమైన మ్యాచ్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ వేసిన క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో.. రాహుల్‌ వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

కాగా ఈ టోర్నీలో ఇప్పటి వరకు కేఎల్‌ రాహుల్‌ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఈ మెగా ఈవెంట్‌లో ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన రాహుల్‌.. 128 పరుగులు మాత్రమే చేశాడు. నాకౌట్‌ దశలో బంగ్లాదేశ్‌, జింబాబ్వేపై మాత్రమే రాహుల్‌ పర్వాలేదనిపించాడు.

మిగితా మ్యాచ్‌ల్లో సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే రాహుల్‌ పరిమితమయ్యాడు. ఇక కీలకమైన సెమీఫైనల్లో విఫలమకావడంతో రాహుల్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు.  ఏంటి రాహుల్‌..? బంగ్లాదేశ్‌, జింబాబ్వే వంటి చిన్న జట్లపై మాత్రం ఆడుతావా అంటూ మీమ్స్‌ వర్షం కురిపిస్తున్నారు.


చదవండిWC 2022 Final: ఫైనల్లో టీమిండియాతో పోరుకు సిద్ధమేనా? పాక్‌ కెప్టెన్‌ ఏమన్నాడంటే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement