టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో కోహ్లి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 40 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 50 పరుగులు చేశాడు. కాగా ఈ ఏడాది మెగా ఈవెంట్‌లో కోహ్లికి ఇది నాలుగో అర్ద సెంచరీ. అదే విధంగా ఈ టోర్నీలో టాప్ రన్ స్కోరర్‌గా కూడా విరాట్ కోహ్లి(296)నే కొనసాగుతున్నాడు.
కోహ్లి సరి కొత్త చరిత్ర
అంతర్జాతీయ టీ20ల్లో విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో 4000 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు.
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 42 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కింగ్ కోహ్లి.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటి వరకు 115 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 4008 పరుగులు సాధించాడు. ఇక విరాట్ తర్వాత స్థానాల్లో రోహిత్ శర్మ(3853), మార్టిన్ గప్టిల్(3531)పరుగులతో ఉన్నారు.
చదవండి: T20 WC 2022 IND Vs ENG: ఏంటి రాహుల్ నీ ఆట? వెంటనే జట్టు నుంచి తీసేయండి!
Comments
Please login to add a commentAdd a comment