T20 WC: Rohit Sharma told, 'We were not upto the mark with ball'
Sakshi News home page

Rohit Sharma On India Loss: తీవ్ర నిరాశకు లోనయ్యాం.. మా ఓటమికి ప్రధాన కారణం అదే.. క్రెడిట్‌ వాళ్లకే!

Published Thu, Nov 10 2022 5:13 PM | Last Updated on Thu, Nov 10 2022 6:29 PM

WC 2022 Ind Vs Eng Rohit Sharma: We Batted Well Not Upto Mark With Ball - Sakshi

T20 World Cup 2022- 2nd Semi-Final- England Beat India By 10 Wickets: ‘‘తీవ్ర నిరాశకు లోనయ్యాం. మేము బాగానే బ్యాటింగ్‌ చేశాం. మెరుగైన స్కోరు నమోదు చేయగలిగాం. కానీ బౌలర్లు రాణించలేకపోయారు. నాకౌట్‌ మ్యాచ్‌లలో ఒత్తిడిని అధిగమించడమే అతి ముఖ్యమైనది. అయినా, మా జట్టులోని ఆటగాళ్లకు ఇలాంటి మ్యాచ్‌లు కొత్తేమీ కాదు. వీళ్లంతా ఐపీఎల్‌లో ఇలాంటి నాకౌట్‌ మ్యాచ్‌లు ఆడినవాళ్లే. కానీ ఈరోజు మాకు శుభారంభం లభించలేదు.

ఇంగ్లండ్‌ విజయంలో క్రెడిట్‌ మొత్తం ఓపెనర్లకే దక్కుతుంది. వాళ్లు అద్భుతంగా ఆడారు. మొదటి ఓవర్‌ నుంచే వారు దూకుడు ప్రదర్శించారు. టోర్నీ మొదటి మ్యాచ్‌లో మేము పట్టుదలగా ఆడిన తీరు గుర్తుండే ఉంటుంది. 

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ హోరాహోరీ పోరు జరిగింది. ఏదేమైనా ఈరోజు మేము మా స్థాయికి తగ్గట్లు ఆడలేదు. మా ప్రణాళికలు పక్కాగా అమలు చేయలేకపోయాం. అందుకే ఇబ్బందుల్లో పడ్డాం’’ అని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. 

మరీ ఇంత దారుణంగా
టీ20 ప్రపంచకప్‌-2022 రెండో సెమీ ఫైనల్లో భారత జట్టు ఇంగ్లండ్‌ చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అడిలైడ్‌ మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఫైనల్‌కు చేరుతుందని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశను మిగులుస్తూ టోర్నీ నుంచి నిష్క్రమించింది రోహిత్‌ సేన. 

వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి(50), ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా(63) అర్ధ శతకాలతో 168 పరుగులు చేయగలిగిన టీమిండియా.. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ను నిలువరించలేకపోయింది. బౌలర్లు పూర్తిగా తేలిపోవడంతో ఇంగ్లండ్‌ ఓపెనర్లు జోస్‌ బట్లర్‌ 80, అలెక్స్‌ హేల్స్‌ 86 పరుగులతో చెలరేగి 16 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించారు. అద్భుత అజేయ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ను ఫైనల్‌కు చేర్చారు. 

ఇక భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ 2 ఓవర్లలో 25, అర్ష్‌దీప్‌ సింగ్‌ రెండు ఓవర్లలో 15, అక్షర్‌ పటేల్‌ 4 ఓవర్లలో 30, మహ్మద్‌ షమీ 3 ఓవర్లలో 39, రవిచంద్రన్‌ అశ్విన్‌ 2 ఓవర్లలో 27 పరుగులు, హార్దిక్‌ పాండ్యా 3 ఓవర్లలో 34 పరుగులు సమర్పించుకున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓటమి అనంతరం ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మ్యాచ్‌ స్కోర్లు:
భారత్‌: 168/6 (20)
ఇంగ్లండ్‌: 170/0 (16)
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: అలెక్స్‌ హేల్స్‌

చదవండి: T20 WC 2022 Ind Vs Eng: 'మీ బౌలింగ్‌కు ఓ దండం రా బాబు.. వచ్చి ఐపీఎల్‌ ఆడుకోండి'
T20 WC 2022 IND Vs ENG: ఏంటి రాహుల్‌ నీ ఆట? వెంటనే జట్టు నుంచి తీసేయండి అంటూ!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement