15 ప‌రుగులు.. 4 వికెట్లు.. బ్యాట‌ర్ల‌కు చుక్కలు! | Shadab Khans dream season continues as Karachi Kings | Sakshi
Sakshi News home page

15 ప‌రుగులు.. 4 వికెట్లు.. బ్యాట‌ర్ల‌కు చుక్కలు!

Published Mon, Feb 7 2022 9:32 AM | Last Updated on Mon, Feb 7 2022 10:29 AM

Shadab Khan’s dream season continues as Karachi Kings - Sakshi

PSL: పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌లో ఇస్లామాబాద్‌ యునైటెడ్ విజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగిస్తోంది. ఆదివారం కరాచీ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ 42 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ మరోసారి ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌ను క‌న‌బ‌రిచాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇస్లామాబాద్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేశాడు. ఇస్లామాబాద్ బ్యాట‌ర్ల‌లో స్టిర్లింగ్‌(39),షాదాబ్ ఖాన్(34), మున్రో(33) ప‌రుగుల‌తో రాణించారు.

కరాచీ కింగ్స్ బౌల‌ర్ల‌లో క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, ఇమాడ్ వ‌సీం,న‌బీ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. ఇక 178 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కరాచీ కింగ్స్ 135 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌ల్గింది. కరాచీ కింగ్స్ బ్యాట‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ న‌బీ(47),సాహిబ్జాద్‌ ఫర్హాన్(25) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌ల‌గా నిలిచారు. ఇక ఇస్లామాబాద్ బౌల‌ర్ల‌లో షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్ల ప‌డ‌గొట్టి కరాచీ కింగ్స్ ప‌త‌నాన్ని శాసించగా, వకాస్ మక్సూద్, హసన్ అలీ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

చ‌ద‌వండి: IPL 2022: పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా పాట్ క‌మిన్స్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement