
షార్జా వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో టీ20లో 66 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో వైట్‌వాష్ నుంచి పాకిస్తాన్ తప్పించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సైమ్ అయూబ్(49) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఇఫ్తికర ఆహ్మద్(31), షాదాబ్ ఖాన్(28) పరుగులతో రాణించారు.
అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గాన్ 116 పరుగులకే కుప్పకూలింది. ఇహ్సానుల్లా,షాదాబ్ ఖాన్ తలా మూడు వికెట్లు సాధించారు. కాగా తొలి రెండు టీ20ల్లో విజయం సాధించిన ఆఫ్గాన్.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో ఆఫ్గాన్ సొంతం చేసుకుంది.
చరిత్ర సృష్టించిన షాదాబ్ ఖాన్
ఇక పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షాదాబ్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన పాకిస్తాన్ బౌలర్‌గా షాదాబ్ నిలిచాడు. ఆఫ్గాన్ ఇన్నింగ్స్ 10 ఓవర్‌లో ఇబ్రహీం జద్రాన్ ఔట్ చేసిన షాదాబ్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
ఇప్పటి వరకు 87 మ్యాచ్‌లు ఆడిన అతడు 101 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది(98) అధిగమించాడు. ఇక ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన జాబితాలో షాదాబ్ ఖాన్ స్ధానంలో నిలిచాడు. తొలి స్థానంలో 134 వికెట్లతో న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ ఉన్నాడు.
చదవండి: AFG vs PAK: రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాలేదు!
Comments
Please login to add a commentAdd a comment