3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా హంబన్‌తోట (శ్రీలంక) వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (ఆగస్ట్ 22) జరుగుతున్న తొలి వన్డేలో పాకిస్తాన్ ఆటగాడు షాదాబ్ ఖాన్ ఓ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. నసీం షా బౌలింగ్‌లో నమ్మశక్యంకాని రీతిలో షాదాబ్ ఖాన్ గాల్లోకి ఎగిరి ఆఫ్ఘన్ కెప్టెన్ హస్మతుల్లా షాహీది (0) క్యాచ్‌ను పట్టుకున్నాడు. షాహీది పుల్ షాట్ ఆడే ప్రయత్నంలో మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న షాదాబ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. షాదాబ్ పక్షిలా గాల్లోకి ఎగురూతూ ఎడమ చేత్తో అందుకున్న అద్భుతమైన డైవింగ్ క్యాచ్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
WHAT A CATCH BY SHADAB...!!!
— Johns. (@CricCrazyJohns) August 22, 2023
The best fielder from Pakistan in this generation.pic.twitter.com/QJAcIlZnLk
అంతకుముందు ఓవర్లోనే షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్, తమ కెప్టెన్ వికెట్ కోల్పోవడంతో మరింత ఇరకాటంలో పడింది. ఆ జట్టు 3.3 ఓవర్లలో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి మూడు కీలకమై వికెట్లు కోల్పోయింది. 3వ ఓవర్ 4, 5 బంతులకు షాహీన్ అఫ్రిది.. ఇబ్రహీం జద్రాన్ (0), రెహ్మత్ షా (0)లను ఔట్ చేయగా.. 4వ ఓవర్ మూడో బంతికి నసీం షా.. ఆఫ్ఘన్ కెప్టెన్‌ను పెవిలియన్‌కు పంపాడు.
అనంతరం 8వ ఓవర్ మొదటి బంతికి, 14వ ఓవర్ మూడో బంతికి హరీస్ రౌఫ్.. ఇక్రమ్ అలీఖిల్ (4), గుర్భాజ్ (18)లను ఔట్ చేయడంతో ఆఫ్ఘన్ జట్టు 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. 15 ఓవర్లు ముగిసాక ఆ జట్టు స్కోర్ 47/5గా ఉంది. ఒమర్‌జాయ్ (10), నబీ (7) క్రీజ్‌లో ఉన్నారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. ఇమామ్ ఉల్ హాక్ (61), షాదాబ్ ఖాన్ (39), ఇఫ్తికార్ అహ్మద్ (30) ఓ మోస్తరుగా రాణించడంతో 47.1 ఓవర్లలో 201 పరుగులు చేసి ఆలౌటైంది. ముజీబ్ ఉర్ రెహ్మాన్ (10-1-33-3), రషీద్ ఖాన్ (10-0-42-2), మహ్మద్ నబీ (10-0-34-2), రెహ్మత్ షా (1.1-0-6-1), ఫజల్ హక్ ఫారూకీ (8-0-51-1) ధాటికి పాక్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment