వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ గాయపడ్డాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా షాదాబ్ ఖాన్ తలకు గాయమైంది. బంతిని ఆపే క్రమంలో షాదాబ్ తల నేలకు బలంగా తాకింది. దీంతో అతడి నొప్పితో మైదానంలో విల్లావిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి పరిశీలించినప్పటికీ ఫలితం లేదు. గాయం తీవ్రం కావడంతో ఫిజియో సాయంతో షాదాబ్ మైదానాన్ని వీడాడు.
ఉసామా మీర్ ఎంట్రీ..
మైదానాన్ని వీడిన షాదాబ్ ఖాన్ తిరిగి మళ్లీ ఫీల్డ్‌లోకి రాలేదు. అతడి స్ధానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఉసామా మీర్ మైదానంలో వచ్చాడు. తద్వారా ఉసామా మీర్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మొదటి ఆటగాడిగా మీర్ రికార్డులకెక్కాడు. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మీర్.. ఓ వికెట్ కూడా సాధించాడు.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్!
Comments
Please login to add a commentAdd a comment