ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో బిగ్‌ షాక్‌..! | More injury trouble for Pakistan, Shadab Khan to miss World Cup? | Sakshi
Sakshi News home page

World Cup 2023: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో బిగ్‌ షాక్‌..!

Published Sat, Oct 28 2023 11:27 AM | Last Updated on Sat, Oct 28 2023 11:29 AM

 More injury trouble for Pakistan, Shadab Khan to miss World Cup? - Sakshi

కవ​‍్దలకలవన్డే ప్రపంచకప్‌-2023లో వరుస ఓటములతో సతమతవుతున్న పాకిస్తాన్‌కు మరో బిగ్‌ షాక్‌ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు వైస్‌ కెప్టెన్‌, స్టార్‌ ఆల్‌ రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌ గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో షాదాబ్‌ ఖాన్‌ గాయపడ్డాడు.

ప్రోటీస్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా బంతిని అపే క్రమంలో షాదాబ్‌ తలకు గాయమైంది. అనంతరం ఫిజియో సాయంతో ఫీల్డ్‌ను వదిలి వెళ్లాడు. గాయం కొంచెం తీవ్రమైనది కావడంతో అతడు తిరిగి మళ్లీ మైదానంలోకి రాలేదు. ఈ క్రమంలో షాదాబ్‌ స్ధానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఉసామా మీర్ వచ్చాడు.

కాగా మ్యాచ్‌ అనంతరం షాదాబ్‌ను స్కానింగ్‌ తరలించగా అతడి గాయం తీవ్రమైనది తేలినట్లు సమాచారం. దీంతో అతడికి రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే అతడు వరల్డ్‌ కప్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నడాని పాకిస్తాన్‌ మీడియా కథనాలు వెలువరిస్తోంది. కాగా దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన పాకిస్తాన్‌ తమ సెమీస్‌ అవకాశాలను గల్లంతు చేసింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్‌ తేడాతో పాక్‌ ఓటమి పాలైంది.
చదవండి: WC 2023: దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి.. నవాజ్‌పై కోపంతో ఊగిపోయిన బాబర్‌ ఆజం! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement