IPL 2022: Have Adopted Jos Buttler As My Second Husband, Jokes Rassie Van Der Dussens Wife Lara - Sakshi
Sakshi News home page

Dussen Wife Joke On Jos Buttler: 'బట్లర్‌ నాకు రెండో భర్త' .. ఎలా అంటే: రాజస్తాన్‌ ఆటగాడి భార్య ఆసక్తికర వాఖ్యలు !

Published Fri, May 27 2022 5:37 PM | Last Updated on Fri, May 27 2022 7:09 PM

Have adopted Jos Buttler as my second husband, jokes Rassie van der Dussens wife - Sakshi

ipl.com

రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు ఆడిన బట్లర్‌.. 718 పరుగులు సాధించి ఈ ఏడాది టోర్నీలో లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా ఉన్నాడు. కాగా టోర్నీ ఆరంభం‍లో అత్యుత్తమంగా ఆడిన బట్లర్‌.. సెకెండ్‌ హాఫ్‌లో కాస్త తడబడ్డాడు. అయితే ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన తొలి క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో బట్లర్‌ 89 పరుగులు సాధించి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు.

ఇక ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఆటగాడు రాస్సీ వాన్ డెర్ డుస్సేన్ భార్య లారా.. బట్లర్‌ బౌండరీ బాదిన ప్రతీసారి చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇటీవల రాజస్తాన్‌ రాయల్స్‌ పాడ్‌కాస్ట్‌లో ధనశ్రీ వర్మ, పృతీ అశ్విన్‌లతో కలిసి మాట్లాడిన లారా ఆసక్తికరమైన వాఖ్యలు చేసింది. కాగా లారాని అందరూ బట్లర్‌ భార్య అని భావించారు. ఇక పోడ్‌కాస్ట్‌లో ఇదే ప్రశ్నకు సమాధానమిస్తూ.."నేను ఇప్పుడు జోస్‌ను నా రెండవ భర్తగా స్వీకరించానని అనుకుంటున్నాను. నన్ను లూయిస్ అని పిలుస్తారు. ఎందుకుంటే అతడి భార్య పేరు అదే కదా అని" లారా నవ్వుతూ సమాధానమిచ్చింది.

"అందరూ నన్ను జోస్ భార్య అని అనుకుంటారు. నాపై కెమెరాలు చాలా సార్లు ఫోకస్‌ చేశాయి, ఆ సమయంలో నేను అతడిని ఉత్సాహపరుస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా అలానే అనుకుంటారు. ధనశ్రీ గాని నేను గాని మ్యాచ్‌ వీక్షిస్తున్నప్పడు మా భావోద్వేగాలను కంట్రోల్‌ చేసుకోలేము. జోస్‌ సెంచరీలు సాధించినప్పుడు మేము మరింత ఎంజాయ్‌ చేశాం. ఇక ఐపీఎల్‌లో రాస్సీ అంతగా ఆడలేదు. కాబట్టి అతడిని నేను ఉత్సాహపరచలేకపోయాను" అని లారా పేర్కొంది. ఇక క్వాలిఫైయర్‌2లో శుక్రవారం ఆర్‌సీబీతో రాజస్తాన్‌ తలపడనుంది.

చదవండి: Dinesh Karthik: దినేశ్‌ కార్తిక్‌ ఏంటిది? డీకేకు మందలింపు! కీలక మ్యాచ్‌కు ముందు షాక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement