IPL 2022: James Neesham Troll Rajasthan Teammate Epic Reaction Instagram - Sakshi
Sakshi News home page

IPL 2022: 'సంజూ శాంసన్‌కు డ్రింక్స్‌ అందించడానికి రెడీగా ఉండు'

Published Tue, May 24 2022 3:23 PM | Last Updated on Thu, May 26 2022 9:58 AM

IPL 2022: James Neesham Troll Rajasthan Teammate Epic Reaction Instagram - Sakshi

PC: IPL Twitter

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో మంగళవారం గుజరాత్ టైటాన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌ జరగనుంది. మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్‌-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉన్న నేపథ్యంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో క్రికెటర్ల నుంచి మీమ్స్‌ గోల  చాలా ఎక్కువైపోయింది.

ముఖ్యంగా వసీం జాఫర్‌, యజ్వేంద్ర చహల్‌లు తమ ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ వేదికగా ఆసక్తికర మీమ్స్‌ పోస్ట్‌ చేస్తూ ఆకట్టుకున్నారు. తాజాగా వీరి జాబితాలో న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ నీషమ్‌ వచ్చి చేరాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టులో ఉన్న నీషమ్‌.. క్వాలిఫయర్‌-1 ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో అదే జట్టుకు చెందిన వాండర్‌ డుసెన్‌ కూడా ప్లే ఆఫ్స్‌కు సన్నద్దమవుతున్న ఫోటోను షేర్‌ చేశాడు.

ప్రాక్టీస్‌లో భాగంగా వేగంగా పరిగెత్తుతున్న ఫోటోను డుసెన్‌ పంచుకుంటూ.. ''కొత్త వారంలోకి పరిగెడుతున్నా.. నా దృష్టిలో అది చాలా పెద్దది( ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఉద్దేశిస్తూ) #ఐపీఎల్‌ 2022'' అని క్యాప్షన్‌ జత చేశాడు. డుసెన్‌ పోస్టును చూసిన నీషమ్‌ సరదాగా ఆట పట్టించాడు. వేగంగా పరిగెత్తుత్ను డుసెన్‌ను చూపిస్తూ.. ''సరే సంజూకు డ్రింక్స్‌ అందించడానికి రెడీగా ఉండు.. విరామ సమయంలో ఎంత వేగంతో డ్రింక్స్‌ అందిస్తే అంత మంచిది'' అంటూ ట్రోల్‌ చేశాడు. నీషమ్‌ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: IPL 2022: వర్షం పడితే కథేంటి.. ఫైనల్‌ చేరే దారులు ఎలా ఉన్నాయంటే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement