IND vs SA, 1st: Jasprit Bumrah Perfect Delivery Dismiss Rassie Van Der Dussen Wicket - Sakshi
Sakshi News home page

IND Vs SA: బుమ్రా సూపర్‌ డెలివరీ.. డసెన్‌కు బొమ్మ కనబడింది

Published Thu, Dec 30 2021 2:47 PM | Last Updated on Thu, Dec 30 2021 3:05 PM

Jasprit Bumrah Perfect Delivery Dismiss Rassie Van Der Dussen Viral  - Sakshi

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయం దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ఐదోరోజు ఆట ఆరంభమైన కాసేపటికే కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ను బుమ్రాను ఎల్బీగా వెనక్కి పంపడంతో దక్షిణాఫ్రికా ఐదో వికెట్‌ కోల్పోయింది. టీమిండియా విజయానికి మరో ఐదు వికెట్ల దూరంలో మాత్రమే ఉంది. ఇక నాలుగో రోజు ఆట కాసేపట్లో ముగుస్తుందనగా టీమిండియా స్పీడస్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అద్భుత బంతితో రాసీ వాండర్‌ డసెన్‌ను వెనక్కి పంపడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: SA Vs IND: బుమ్రాకి బౌలింగ్‌ ఎలా చేయాలో సూచనలు చేసిన కోహ్లి..

తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ సమయంలో గాయపడిన బుమ్రా ఆ తర్వాత బ్రేక్‌ తీసుకున్నాడు. డైరెక్టుగా టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌ సమయానికి గ్రౌండ్‌లో అడుగుపెట్టాడు. అయితే బౌలింగ్‌ వేస్తాడా లేదా అన్న సందేహంలోనే బుమ్రా రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు దిగాడు. అప్పటికే ఎల్గర్‌.. వాండర్‌ డసెన్‌తో కలిసి 22 ఓవర్ల పాటు ఓపికగా ఆడుతూ 40 పరుగులు జతచేశారు.

ఇక వికెట్‌ పడడం గగనం అనుకున్న సమయంలో బుమ్రా అద్భుత బంతితో మెరిశాడు. బుమ్రా ఆఫ్‌ స్టంప్‌ అవతల బంతి వేయడంతో​ వాండర్‌ డసెన్‌ అది వైడ్‌ లైన్‌ మీదుగా బయటకు వెళుతుందని భావించాడు. అయితే వికెట్లకు కూడా పూర్తిగా అడ్డుగా నిల్చున్నాడు. కానీ బంతి ఊహించనంతగా టర్న్‌ తీసుకొని ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ అయి ఆఫ్‌స్టంప్‌ను ఎగురగొట్టింది. ఈ దెబ్బకు డసెన్‌ వద్ద సమాధానం లేకుండా పోయింది.

చదవండి: Marco Jansen Vs Kohli: ఒకప్పుడు నెట్‌బౌలర్‌గా కోహ్లి​కి చుక్కలు.. కట్‌చేస్తే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement